Connect with us

పత్రికా సమావేశం

తెలుగులోనే సినిమాలు చేస్తా – యువ హీరో సుమంత్ శైలేంద్ర

Published

on

పి ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రాండ్ బాబు. క్రేజీ డైరెక్ట‌ర్ మారుతి స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదల కాబోతోంది. మనలో చాలా మందికి బ్రాండ్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడం సహజమే. ఒక్కసారి ఈ బ్రాండ్ పిచ్చి అలవాటైతే ఆదో వ్యాపకంగా మారిపోతుంది. మరి అలాంటి బ్రాండ్ బాబుకు .. ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్ బాబు. మారుతి కథ అందిస్తున్న ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు కన్నడ హీరో సుమంత్ శైలేంద్ర. తెలుగు భామ ఈషా రెబ్బ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సందర్బంగా హీరో శైలేంద్ర చెప్పిన విశేషాలు …

ఈ సినిమా మంచి కథతో వస్తుంది . బ్రాండ్స్ అంటే బాగా పిచ్చి ఉన్న డబ్బున్న యువకుడిగా కనిపిస్తాను. ఇతని తండ్రికి కూడా అదే పిచ్చి .. అలంటి అబ్బాయి ఓ సాధారణ మధ్య తరగతి .. అంటే టి కొట్టు నడుపుకునే వాడి కూతురితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న అంశాలను పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ వేలో చూపించిన చిత్రమిది. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. నేను కన్నడలో నాలుగు సినిమాలు చేశాను.

అల్లు అర్జున్ సినిమాలంటే పిచ్చి
మా నాన్న నిర్మాత .. ఇప్పటి వరకు 20 కి పైగా సినిమాలు తీసాడు . తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా సీతమ్మ అందాలు రామయ్య చిత్రంలో నిర్మాతగా అడుగుపెట్టాడు. నాకు తెలుగు సినిమాలంటే చాలా ఆసక్తి అల్లు అర్జున్ సినిమాలంటే పిచ్చి. అందుకే తెలుగులో హీరోగా చేయాలన్న ఆలోచన ఉండేది. అలా మారుతి గారితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆయనతో మీరు ఓ కథ ఇస్తే నేను హీరోగా చేస్తానని అడిగే వాడిని .. ఆలా తాను ఈ కథ ఇచ్చాడు. మంచి ఫామిలీ, లవ్ ఎంటర్ టైనర్ ఇది. నిజంగా చాలా మందికి బ్రాండ్ అంటే పిచ్చి ఉండడం మనం చూసాం .. నాకు మాత్రం అలాంటి పిచ్చి లేదు. నేను నిర్మాత కొడుకునైన‌ప్ప‌టికీ కూడా జీవితం విలువ తెలుసు. ఇక ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటానన్న నమ్మకం ఉంది. ఈ సినిమా తరువాత కన్నడలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులోనే సినిమాలు చేయాలని ఉంది.

తాజా వార్తలు

`ఐశ్వ‌ర్యాభిమ‌స్తు` మ్యూజిక్ లాంచ్‌

Published

on

By

శ్రీమ‌తి వ‌రం మాధ‌వి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆర్య‌, విశాల్, సంతానం, త‌మ‌న్నా, భాను న‌టించిన చిత్రం `ఐశ్వ‌ర్యాభిమ‌స్తు`. ఎం.రాజేష్ ద‌ర్శ‌కుడు. వ‌రం జ‌య‌త్ కుమార్ నిర్మాత‌. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల సీడీని కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా బుధ‌వారం హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు.
ర‌మేశ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “మా నాన్న పెద్ద భూస్వామి అయినా.. నాన్న సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్ప‌కుండా సినిమాల్లో రాణించాల‌ని ముంబై వెళ్లిపోయారు. నెమ్మ‌దిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. ద‌ర్శ‌కుడిగా ఎదిగారు. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల‌పై మంచి ప‌ట్టు సాధించారు. ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్స్ సిల్వ‌ర్ జుబ్లీలు చాలా తీసింది. స‌కుటుంబంగా చూడ‌ద‌గ్గ కుటుంబ విలువ‌లున్న సినిమాల‌ను చాలా చేశాం. ఏక్ తుఝే కేలియే కూడా చేశాం. ఇవ‌న్నీ చాలా వండ‌ర్స్ సృష్టించాయి. మా నాన్న సినిమాల‌పై త‌ప్ప‌, ఇంక‌దేనిపై ఇన్వెస్ట్ చేయ‌డానికి ముందుకొచ్చేవారు కాదు. అందుకే మాకు చెన్నై, ముంబై, బెంగుళూరు, హైద‌రాబాద్‌లో కార్యాల‌యాలున్నాయి. అంద‌రిళ్ల‌ల్లో  మా ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్స్ గురించి తెలుసు. నంద‌గోపాల్ అని మా ద‌గ్గ‌ర ఆడిట‌ర్ ఉన్నారు. ప్ర‌జ‌లు సినిమా చూడ‌టం వ‌ల్ల‌నే నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నాను అని అనుకుని రూ.కోటి పెట్టి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసి, ఐదెక‌రాల స్థ‌లాన్ని కేటాయించాం. నాగేశ్వ‌ర‌రావుగారు ఓ డాక్ట‌ర్‌. ఆయ‌న కూడా మా నాన్న‌లాగానే సేవాత‌త్ప‌ర‌త ఉన్న వ్య‌క్తి. మ‌న ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికే ఆయ‌న మ‌న దేశానికి వ‌చ్చాడు. మా ఐ ఇన్‌స్టిట్యూట్ ని అంత‌ర్జాతీయ గుర్తింపు ఉంది. భ‌విష్య‌త్తు త‌రాల వారికీ ఉప‌యోగ‌ప‌డే ప్రాజెక్ట్ అది. 50 శాతం మందికి మేం అక్క‌డ ఉచితంగా సేవ‌లు అందిస్తున్నాం“ అని అన్నారు.
నిర్మాత వ‌రం జ‌య‌త్ కుమార్ మాట్లాడుతూ – “ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేస్తున్నాం. త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాం. స‌పోర్ట్ అందిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌“ అన్నారు.
కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా మాట్లాడుతూ – “నిర్మాత జ‌యంత్‌కు ఈ సినిమా పెద్ద విజ‌యాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్య‌తో నాకు మంచి అనుబంధం ఉంది. త‌న‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. త‌మిళంలో సూప‌ర్‌హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ – “మంచి హిలేరియ‌స్ ఎంటర్‌టైన‌ర్‌. జ‌యంత్ తెలుగులో చేస్తున్న ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెస్ కావాలి. పాజిటివ్ ప‌ర్స‌న్ జ‌యంత్ పెద్ద స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
By:    Nasreen Khan

Continue Reading

తాజా వార్తలు

సోషియో ఫాంటసీ హారర్

Published

on

By

ఎంటర్ టైనర్ ‘గండ భేరుండ’ పాటల విడుదల!!

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ ‘గండభేరుండ’. చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా.. రాధిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పాటలు ట్రెండ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అక్టోబర్ 5 న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. హీరోయిన్ రాధిక, దర్శకుడు సూరియన్, నిర్మాత చల్లమళ్ల రామకృష్ణ, హీరోల్లో ఒకరైన పవన్ కుమార్, విలన్ పాత్రధారి రవికిరణ్ శొంఠి, లేడీ డైరెక్టర్ సుచరిత, ఆనంతలక్ష్మి, డి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాటలతోపాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన అనంతరం ‘గందభేరుండ’ ఘన విజయం సాధించాలని లయన్ సాయి వెంకట్, జె.వి.మోహన్ గౌడ్ ఆకాంక్షించారు. హీరోయిన్ గా పరిచయమవుతున్న రాధికకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు.
 
 దర్శకుడు సూర్యన్ మాట్లాడుతూ.. ‘గండ భేరుండ పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్ని అత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే ఇతివృత్తంతో రూపొందిన సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ ‘గండభేరుండ’. మలేషియాలో చేయించిన 17 నిమిషాల నిడివి కల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మా నిర్మాతలు కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ ‘గండభేరుండ’ చిత్రాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం. సినిమా అద్భుతంగా వచ్చింది” అన్నారు. 
 
నిర్మాత చల్లమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. “సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. 
రవికిరణ్, సమ్మెట గాంధీ, విశ్వేశ్వరావు, జయవాణి, రాధ, శ్రీరంభ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి  కెమెరా: ఆనంద్, సంగీతం: శ్రీసాయిదేవ్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాతలు: కె.సూరిబాబు-చల్లమళ్ళ రామకృష్ణ, రచన-దర్శకత్వం: కె.సూరిబాబు!!
By:    Nasreen Khan

Continue Reading

తాజా వార్తలు

‘ నాటకం ‘ మూవీ సక్సెస్ మీట్..!!

Published

on

By

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా  విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం  ‘నాటకం’.. కళ్యాణ్ జి గోగన దర్శకుడు.  సాయి కార్తీక్ సంగీతం అందించగా గరుడవేగతో మంచి పేరు తెచ్చుకున్న అంజి సినిమాటోగ్రఫీ ని అందించారు..   కాగా ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా రిలీజ్ అయ్యింది.  ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ను ఈ రోజు ఎంతో అంగరంగవైభవంగా జరిపారు.. ఈ కార్యక్రమానికి సినిమా టీం అందరు రాగ, సినిమా  హిట్ పై తమ ఆనందాన్ని వెల్లడించారు..
ఈ సందర్భంగా నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ..  నమ్మి సినిమా ని కొన్నందుకు అది మీరు ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాల థాంక్స్.. మా బ్యానర్ లో ఫస్ట్ ఫిలిం ఇంత పెద్ద హిట్ అవడం చాల హ్యాపీ గా ఉంది.. ఈ ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తానని చెప్తున్నాను.. అందరు కష్టపడి చేసిన సినిమా ఇది.. చిన్న సినిమా, అదీ అందరు కొత్త ఆర్టిస్టులతో వచ్చిన సినిమా ఇలాంటి సినిమా హిట్ చేసినందుకు చాల చాల థాంక్స్ అన్నారు..
హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ..   అందరు ఫోన్ చేసి సినిమా చాల బాగుందని అంటున్నారు.  ఇక్కడే కాదు యూకే నుంచి కూడా మంచి టాక్ వస్తుంది. సినిమా నిన్న రిలీజ్ కాగానే మంచి రెస్పాన్స్ వచ్చింది.. చాల హ్యాపీ గా ఉంది. వేరే ప్లేసెస్ లో సినిమా రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికి ధన్యవాదాలు అన్నారు..
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ..
చిన్న సినిమాలను మళ్ళీ మళ్ళీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ కూడా చాల బాగా వచ్చాయి.. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి చాల థాంక్స్..ఈ సినిమా కి మెయిన్ మౌత్ టాకే పబ్లిసిటీ.. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఈ సినిమా కి పనిచేసిన అందరికోసం ఈ సినిమా  సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
By:    Nasreen Khan

Continue Reading

Trending