Connect with us

స్టార్ TALK

నమ్మకం ఉంటె తప్ప చిన్న సినిమా చేయను: దర్శకుడు మారుతి

Published

on

నాగచైతన్య, అనుఇమ్మాన్యుయేల్ జంటగా.. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్, పి.డి.వి.ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. సెప్టెంబర్ 13న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి చెప్పని విశేషాలు ..

విభిన్నమైన ప్రయత్నం ..

నేను తీసిన సినిమాలన్నింటిలో డిఫరెంట్ సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రీరికార్డింగ్ సహా సినిమా చూశాను. చాలా శాటిస్‌ఫాక్షన్‌గా అనిపించింది. కుటుంబం అంతా కలిసి చూసే ఓ ఎంటర్‌టైనర్ ఇది. నటుడు ఎదిగే కొద్ది పరిణితి వస్తుంది. అలాంటి ఓ మెచ్యూరిటీ నాగచైతన్యలో చూశాను. కొన్ని సీన్స్‌లో తన నటనను చూస్తే నాగార్జుననే చూసినట్లు అనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో.. ఫస్టాఫ్‌లో లవ్‌స్టోరి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ స్టోరి ఉంటుంది. ఇప్పటి వరకు తను లవర్‌బోయ్‌లా నటించాడు. కానీ ఇది అలా ఉంటూనే యాక్టివ్‌గా చేశాడు.

అత్త, అల్లుడు మధ్య ….

అత్త, అల్లుడు మధ్య జరిగే ఛాలెంజ్ తరహా కథ ఇది కాదు. కంప్లీట్‌గా డిఫరెంట్ మూవీ. ఓ సాధారణ కుర్రాడు. శైలాజరెడ్డికి ఎలా అల్లుడయ్యాడనేదే కథ. అంతే తప్ప అల్లుడు అయిన తర్వాత కథ ఇది కాదు. సాధారణంగా అత్త.. ఆమె కూతురితో ఉండే ఇగోయిస్టిక్ సమస్యలే ఈ సినిమా కథ. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నాగచైతన్యకి ఓపిక ఎక్కువ. పాజిటివ్ విషయాలనే ఆలోచిస్తాడు. తన పని తాను చేసుకుంటూ వెళ్లేరకం. నాగచైతన్య బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే కథ. తను కూడా కథో, క్యారెక్టరో హీరోయిక్‌గా ఉండాలని అనుకోడు. ఉదాహరణకు ఒకవేళ మనం రుస్తుం, ఊరికి మొనగాడు అనే తరహా హీరోయిక్ టైటిల్ పెడితే తనకే నచ్చదు.

ఇగోయిస్ట్ల కథ…

ఇగో అందరిలో ఉంటుంది. మనతో పాటు మనలోని ఇగో పెరుగుతుంటుంది. మనకు కావాల్సినవన్నీ దొరికితే ఎదుటి వ్యక్తి మాట వినం. అప్పుడు మనలో అహం వచ్చేస్తుంది. ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేం. సమస్యలు అక్కడే మొదలవుతాయి. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణగారు చాలా చక్కగా యాప్ట్ అయ్యారు. సాధారణంగా అత్త అల్లుడు మధ్య జరిగే కథ. అత్త విలన్‌గా ఉండటాన్ని ఎప్పటి నుండో చూస్తున్నాం. కానీ ఇది వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. రమ్యకృష్ణగారు ఇందులో విలన్‌గా కనపడరు. అల్లుడు బేస్ మీద సినిమా వచ్చి చాలా కాలమైంది. ఇలాంటి కథతో సినిమా చేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. అదీగాక నాగచైతన్యలాంటి వ్యక్తి ఇది వరకు చేసిన సినిమాలకు భిన్నంగా శైలజారెడ్డి అల్లుడు అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే టిపికల్‌గా ఉంటుందనిపించింది. తెలుగు ప్రేక్షకులు సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చెన్నకేశరెడ్డి, నరసింహ నాయుడు వంటి సినిమాలను చూసి ఓ పవర్‌ఫుల్ హిట్స్ చేశారు. మన సినిమా టైటిల్‌లో రెడ్డి అనే పదం యాడ్ చేయడం వెనుక ఓ పవర్‌ఫుల్ నెస్ వస్తుందనే ఆలోచనే తప్ప మరొటి లేదు. సినిమా క్లాస్‌గా ఉంటుంది.

అందుకే ఆలస్యం..
వరదల కారణంగానే సినిమా రిలీజ్ ఆలస్యమైంంది. కేరళకు వెళ్లాను. వెళ్లినరోజు నుండే వరదలు. తగ్గుతుందేమో అని వెయిట్ చేశాను. తగ్గలేదు .. సరికదా! పెరుగుతూ వచ్చింది. గోపీ సుందర్ బంధువులు కూడా వరదల్లో చిక్కుకోవడంతో తను టెన్షన్ పడుతుండేవాడు. అలాంటి సమయంలో తనను ఇబ్బంది పెట్టడం సరికాదనిపించింది. అందుకే రెండు వారాలు గ్యాప్ తీసుకుని వస్తున్నాం. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ బయట ఎలా ఉంటుందో.. సినిమాలో కూడా అలాగే ఉంటుంది. తనైతే సినిమాకు సూట్ అవుతుందనిపించింది. సినిమా చూసుకున్న తర్వాత నేను రియల్‌గా ఉన్నట్టే సినిమాలో ఉన్నానని అంది. మనకు తెలియని జోనర్ సినిమాలు మరుగున పడిపోతున్నాయి. ఒకప్పుడు పాలిటిక్స్ సినిమాలు, సోషియో ఫాంటసీ సినిమాలు ఎక్కువగా వస్తుండేవి. కానీ ఇప్పుడు రావడం తగ్గిపోయాయి. డైరెక్టర్‌గా నేను కూడా మారాలి. కొత్త జోనర్‌లో సినిమాలు చేయాలి.

డిజార్డర్ సినిమాలు..
డిజార్డర్ సినిమాలు చేయాలంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం కాస్త గ్యాప్ ఇచ్చాను. చాలా డిజార్డర్స్ ఉన్నాయి. వాటిపై సినిమాలు తీయాలి. నేను ఒక కథ చెప్పినప్పుడు మరొకరు బాగా డైరెక్ట్ చేస్తే అదొక రకం. అదే నేను కథను మరొకరితో తీయించాలనుకున్నప్పుడు అదొక రకం. వాళ్లు తీయ్చొచ్చు.. తీయలేకపోవచ్చు. వేరేవాళ్లు డైరెక్ట్ చేస్తున్నప్పుడు వారితో మనం కొంత దూరం మాత్రమే ట్రావెల్ చేయగలుగుతాం. అంతకు మించి చేయలేం. ఇక చిన్న సినిమాను నా నిర్మాణంలో చేయడం ఆపేశాను. నాతో పాటు నా టీమ్‌కు చాలా నమ్మకం ఉంటే తప్ప చిన్న సినిమాలు చేయకూడదని అనుకుంటున్నాను. చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా తేడా ఏం ఉండదు. నిజం చెప్పాలంటే చిన్న సినిమాకే ఎక్కువ కష్టం ఉంటుంది. ఇమేజ్ లేని నటీనటులు నటించిన చిత్రానికి ఆడియెన్స్‌ను రప్పించడం చాలా కష్టం.

తదుపరి చిత్రాలు..
గీతాఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ కలిసి చేస్తున్న సినిమా.. మహేష్ సిస్టర్ మంజులగారి నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనే ఆసక్తి ఉంది. అల్లరి నరేశ్ సినిమా కూడా ఉంటుంది.

స్టార్ TALK

లేడీ ఓరియంటెడ్ సినిమాలు పెరగడం మంచి పరిణామం – భూమిక

Published

on

By

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలవుతుంది. ఈ సందర్భంగా భూమిక పాత్రికేయులతో మాట్లాడుతూ …

భిన్నమైన పాత్రలో కనబడతాను
ఇది వరకు నేను నటించిన చిత్రాలకు భిన్నమైన పాత్రలో `యు టర్న్` లో కనపడతాను. ఓ ఆర్టిస్ట్ భిన్నమైన పాత్రలు చేస్తేనే నటుడిగా సంతృప్తి.. గుర్తింపు దొరుకుతుంది. నేను కన్నడ `యు టర్న్` చూశాను. అయితే నేను నా తరహాలో నటిస్తూనే డైరెక్టర్ ఎలా కావాలనుకుంటున్నారో అలాంటి ఔట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. యు టర్న్లో నేను చేసిన పాత్రను మరే సినిమాలోనూ చేయలేదు. తెరపై ఎలా ఉంటుంది. ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే దానిపై ఎగ్జయిటింగ్గా ఉన్నాను.

సమంత అద్భుతమైన నటి
సమంత అద్భుతంగా నటించింది. ఈగలో తను నటన చూశాను. ఆన్ సెట్స్లో తను ఇన్స్టెంట్ ఎనర్జీతో నటిస్తుంది. పాత్ర ఎంత నిడివి ఉందనడం కంటే ఎంత ప్రాముఖ్యత ఉంది అని చూసుకుని దాన్ని ఇంపాక్ట్తో నటిస్తే చాలు. నేను కూడా మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాను. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే అలాంటి సినిమాల సంఖ్య ఇంకా పెరగాలి. మన రచయితలు అలాంటి పాత్రలను క్రియేట్ చేయాలి.తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. మంచి టీమ్ కుదిరితే.. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా చేస్తాను.

చూసే కోణం మారింది
1999లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇరవైయేళ్లుగా నటిగా రాణిస్తున్నాను. ఈ సమయంలో మనతో పాటు మన చుట్టు పక్కల ఉండే చాలా విషయాలు మారుతాయి. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు నా చుట్టూ ఉన్న విషయాలను చూసే కోణం మారింది. సక్సెస్, ఫెయిల్యూర్ నన్ను ఎప్పుడూ బాధించవు. నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం అలాంటిది. ఇప్పుడున్నంతగా సోషల్ మీడియా ఒకప్పుడు లేదు. కాబట్టి నాపై జయాపజయాలు పెద్దగా ఎఫెక్ట్ పడలేదు.

హిందీలో ఈ ఏడాది విడుదల కాబోయే `ఖామోషి` చిత్రంలో నా పాత్ర చిన్నదే అయినా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే తమిళంలో ఓ సినిమా.. తెలుగులో యు టర్న్ సినిమాలు చేశాను. ప్రతి పాత్ర చాలా వైవిధ్యమైనదే.

Continue Reading

స్టార్ TALK

కథతో పాటు అన్ని విషయాలు పట్టించుకుంటా – అను ఇమ్మాన్యుయేల్

Published

on

By

మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ అను ఇమ్మానుయేల్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు అందుకున్న ఈమె తాజాగా నాగ చైతన్య సరసన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తుంది. మారుతీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైనెంట్న్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల అవుతున్న సందర్బంగా మలయాళ భామ అను ఇమ్మానుయేల్ తో ఇంటర్వ్యూ ..

పెద్ద ఇగోయిస్టుగా ..

ఈ చిత్రంలో నేను పెద్ద ఇగోయిస్టు గా నటించాను. కానీ అందులో కామెడీ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారా ఎక్కువగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సినిమా విషయంలో నిజంగా సీనియర్ నటి రమ్య కృష్ణ గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇందులో ఆమె కూతురి గా నటించాను . రమ్య మేడమ్ చాలా బ్రిలీయంట్ ఒక్కసారి స్క్రిప్ట్ చూసుకొని ఎంత పెద్ద డైలాగ్ నైనా అలోవకగా చెప్పేస్తుంది.

వరుస పరాజయాలు ..

ఎవరైనా సినిమా హిట్ అవ్వాలనే చేస్తారు. నిజానికి అజ్ఞాతవాసి కథ ను తివిక్రమ్ గారు చెప్పారు . నా పాత్ర గురించి వివరించిన తరువాతే ఆసినిమా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత పాత్ర గొప్పగా ఉండదు .. కానీ ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఇది కూడా అలాగే ఉంటే నేను చేయకపోయేదాన్ని. ఆసినిమాలోచేయడానికి మరొక కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో నటించే అవకాశం వచ్చింది. నాపేరు సూర్య కూడా కథ విన్నాకే ఒప్పుకున్నాను. ఇక లేటెస్ట్ గా గీతా గోవిందం సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సమయంలో అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చేస్తున్నాను. అందుకే చేయడం కుదరలేదు. ఇప్పుడు ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. నిజంగా ఆ సినిమా మిస్ అయినందుకు కొంచెం ఫీల్ అవుతున్నా

చైతు తో ..

నాగ చైతన్య తో సినిమా చేయడం చాలా హ్యాపీ. తాను చాలా కూల్ గా ఉంటాడు. అలాగే దర్శకుడు మారుతీ కూడా ఆయనకు ఈ కథపై చాలా కమిట్మెంట్ ఉంది. ప్రతి విషయంలో తీసుకున్నాడు. ఈ సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు. నేను అజ్ఞాత వాసి సినిమాకు మాత్రమే డబ్బింగ్ చెప్పను. అలాగే గీత గోవిందం కు కూడా. తెలుగు అర్థం అవుతుంది .. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.

తదుపరి చిత్రాలు ,..

ఇప్పటివరకు ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. శైలజారెడ్డి అల్లుడు విడుదలైన తరువాత డిసైడ్ అవుతాను. అలాగే తమిళ, మలయాళ భాషల్లో కూడా చేయాలనీ ఉంది. మలయాళం స్క్రీన్ షేర్ తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు నివిన్ పౌలీ తో ఒక సినిమాలో నటించాను. ఆసినిమాలో కూడా స్క్రీన్ షేర్ తక్కువగానే వుంటుంది. అందుకే మంచి పాత్రలకోసం ఎదురుచూస్తున్నాను.

Continue Reading

స్టార్ TALK

అలా బ్రాండ్ బాబు ను నేను డైరెక్ట్ చేశా – దర్శకుడు ప్రభాకర్

Published

on

By

మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన చిత్రం ‘బ్రాండ్బాబు’. ఆగస్ట్ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాకర్ చెప్పిన విశేషాలు ..

తొలిచిత్రం డిసప్పాయింట్ చేసింది
నేను డైరెక్ట్ చేసిన తొలి చిత్రం `నెక్స్ట్ నువ్వే` పెద్ద డిసప్పాయింట్ చేసింది. అందుకు కారణం. సీరియల్స్ ద్వారా నాకు ఫ్యామిలీ, చిన్న పిల్లలు అభిమానులయ్యారు. అటువంటి వారిని నేను థియేటర్స్కి రప్పించలేకపోయాను. తమిళ సినిమాను చూసిన నాకు సినిమా బాగా నచ్చింది. ప్రతి సీన్ను కామెడీతో ఉండేలా చూసుకుని సన్నివేశాలను రాసుకున్నాం. కానీ.. హారర్ సినిమా కావడంతో దానికి ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎ సర్టిఫికేట్ అంటే పెద్దలకు మాత్రమే అని అనుకున్నారేమో కాబోలు.. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు నా సినిమాకు రాలేదు. మొదటి సినిమా డైరెక్ట్ చేసే సమయంలో నేను బాగా డైరెక్ట్ చేస్తున్నానని బన్ని వాసు, ఎస్.కె.ఎన్ వంటివారు మారుతిగారికి చెప్పడం వల్ల.. ఆయన తయారు చేసుకున్న `బ్రాండ్బాబు` కథను నాకు అప్పగించారు. ఆయన చక్కగా వండిన వంటను ప్రేక్షకులకు అందంగా వడ్డించడమే నా పని అన్నట్లు `బ్రాండ్బాబు` సినిమాను డైరెక్ట్ చేశాను. సినిమా బౌండెడ్ స్క్రిప్ట్తో మారుతిగారు నాకు అప్పగించారు.

మారుతి బ్రాండ్ నాకు ప్లస్ అవుతుంది
మారుతి ఒక బ్రాండ్. ఆయన వల్ల నాకు పేరు వస్తే ప్లస్ అవుతుందే కానీ మైనస్ కాదు. రేపు సినిమా చూసిన ఆడియెన్స్కు సినిమా మారుతిగారే డైరెక్ట్ చేశారనేలా ఉంటుంది. ఈ సినిమాలో ఓ రోజు అంటే.. ఒకటిన్నర సీన్ను ఆయనే డైరెక్ట్ చేశారు. దానికి ప్రధాన కారణం. సినిమాటోగ్రాఫర్.. నా బ్రదర్ చనిపోయారు. నేను వెళ్లాల్సిన పరిస్థితి. మారుతిగారు షూటింగ్ క్యాన్సిల్ చేయమన్నారు. కానీ నాకు అలా క్యాన్సిల్ చేయడం ఇష్టం లేదు. అందుకని ఆయన్నే డైరెక్ట్ చేయమని నేను కోరడంతో ఆయనే ఆరోజు షూటింగ్ను డైరెక్ట్ చేశారు. మారుతిగారు కథ, స్క్రీన్ప్లే, మాటలు అందించారు. షూటింగ్ సమయాల్లో లొకేషన్కు వచ్చేవారు. కానీ షూటింగ్లో ఎక్కడా వేలుపెట్టలేదు. బ్రాండ్ బాబు సినిమా విషయానికి వస్తే.. నిజ జీవితంలో బ్రాండ్స్ అంటే ఇష్టపడేవారిని చూసుంటాం. అలాంటి వారి క్యారెక్టర్ను కాస్త అతిగా చూపిస్తూ.. ఎటకారంగా ప్రొట్రేట్ చేస్తూ తీసిన సినిమా ఇది. ఇలా చేయడం వెనుకు ఆడియెన్స్ను నవ్వించడమే ప్రధాన కారణం.

సుమంత్ శైలేంద్ర డెబ్యూ హీరోలా కష్టపడ్డాడు
సుమత్ శైలేంద్ర కన్నడంలో నాలుగు సినిమాలు చేసినా.. తెలుగులో డెబ్యూ హీరోలాగా కష్టపడ్డాడు. లుక్లో జెన్యూనిటీ తెలియాలని జిమ్కు వెళ్లాడు. డైలాగ్స్ను ముందుగానే ప్రాక్టీస్ చేసుకున్నాడు. సినిమాలో బ్రాండ్బాబు అనే క్యారెక్టర్కు సుమంత్ శైలేంద్ర కరెక్ట్గా యాప్ట్ అవుతాడు. హోం మినిష్టర్ కూతరిని ప్రేమించాలనుకునే హీరో.. వాళ్లింటి పని మనిషిని ప్రేమిస్తాడు. చివరకు పరిస్థితులు ఎలా మారాయనేదే కథ. నా దగ్గర 7-8 స్ర్కిప్ట్స్ ఉన్నాయి. ఆ స్క్రిప్ట్స్ అన్ని నా స్టైల్ ఆఫ్ ఎమోషన్స్తో ఉంటాయి. వాటితో సినిమా చేయాలని నిర్మాతలు కోరినప్పుడు తప్పకుండా సినిమా చేస్తాను. తదుపరి మారుతిగారు మరో సినిమా చేద్దామన్నారు. అలాగే జ్ఞానవేల్ రాజగారి ప్రొడక్షన్లో మరో సినిమా చేయాల్సి ఉంది.

Continue Reading

Trending