Connect with us

గాసిప్

లిప్ లాక్ చేస్తే తప్పేమిటి – హీరోయిన్ పాయల్ రాజపుత్

Published

on

కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ జంట‌గా KCW బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన చిత్రం `RX 100`. ఈ చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. An Incredible Love Story అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. ఈ చిత్రం ఈ నెల 12న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ విశేషాలు తెలిపింది. ఇంత‌కు ముందు నేను పంజాబీ సినిమాల్లో న‌టించాను. రీసెంట్‌గా సైర‌ట్ పంజాబీ రీమేక్‌లో న‌టించాను. ఆ సినిమాలో నా న‌ట‌న‌కు ఫిలింఫేర్ అవార్డు కూడా వ‌చ్చింది. సీరియ‌ల్స్‌లో కూడా న‌టించాను. `ఆర్‌.ఎక్స్ 100` తెలుగులో నా తొలి చిత్రం. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత సినిమా సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది.

సినిమాను అంగీక‌రించేట‌ప్పుడు స్క్రిప్ట్‌తో పాటు డైరెక్ట‌ర్‌.. ప్రొడ‌క్ష‌న్ హౌస్ అన్నీ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాను.
అజ‌య్‌గారు ఆర్ ఎక్స్ 100 క‌థ నెరేట్ చేసిన‌ప్పుడు నా పాత్ర బాగా న‌చ్చింది. డిఫ‌రెంట్‌గా ఉంద‌నిపించింది. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌. తెలుగు భాష‌లో న‌టించ‌డం ఎలా అని అనుకున్నాను. కానీ.. సెట్‌లోకి అడుగుపెట్టిన త‌ర్వాత డైరెక్ష‌న్ టీమ్‌.. ఇత‌ర స‌భ్యుల స‌హ‌కారంతో క‌ష్ట‌మ‌నిపించ‌లేదు. ప్ర‌తి సీన్ గురించి అజ‌య్‌గారికి క్లారిటీ ఉంది. నేను ప‌నిచేసిన ద‌ర్శ‌కుల్లో బెస్ట్ ప‌ర్స‌న్ అజ‌య్‌గారే. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. నా రోల్ చిన్న‌దా? పెద్దదా? అని ఆలోచించ‌ను. పాత్ర ప్రాముఖ్య‌త‌ను గురించి ఆలోచిస్తాను. స్క్రిప్ట్‌లో భాగ‌మైనందు వ‌ల్ల‌నే లిప్‌లాక్ సీన్స్‌లో న‌టించాను. అందులో త‌ప్పేం క‌నిపించ‌లేదు. ఓ న‌టిగా స్క్రిప్ట్‌కు న్యాయం చేయ‌డం నా బాధ్య‌త‌గా భావించాను. కార్తికేయ మంచి మిత్రుడే కాదు.. మంచి వ్య‌క్తి కూడా. మంచి కో స్టార్‌. ఇద్ద‌రం బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాం. అలాగే రాంకీగారు, రావు ర‌మేశ్‌గారు..లాంటి సీనియ‌ర్ న‌టీన‌టులతో చేయ‌డం మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. ఇప్పుడు తెలుగు నేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాను. తెలుగు క్లాసులకు వెళుతున్నాను. తెలుగు సినిమాల్లో న‌టిచండానికి ఆస‌క్తిగా ఉంది. సెప్టెంబ‌ర్‌లో ఓ తెలుగు సినిమా చేయ‌బోతున్నాను. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేశ్ .. సినిమాల‌ను చూశాను. తెలుగులో నాకు ప్ర‌భాస్ అంటే ఇష్టం. ఆయ‌న‌తో భ‌విష్య‌త్‌లో త‌ప్ప‌కుండా క‌లిసి న‌టిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది అని చెప్పింది.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గాసిప్

రాజశేఖర్ ‘కల్కి’ కోసం 2 కోట్లతో సెట్.. 1980 నాటి తెలంగాణ..

Published

on

By

పీఎస్వీ గరుడవేగ బ్లాక్బస్టర్తో యాంగ్రీ యంగ్మ్యాన్ రాజశేఖర్ జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం అ! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో కల్కి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కల్కి చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్రం కోసం భారీ సెట్ను నిర్మించినట్టు తెలుస్తున్నది. సినిమాలో కీలకంగా మారడంతో ఈ సెట్ను 2 కోట్లతో రూపొందించినట్టు తెలిసింది. 1980 దశకంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ను ప్రతిబింబించేలా వాతావరణాన్ని క్రియేట్ చేసినట్టు సమాచారం.

తెలంగాణ ప్రాంతంలోనే చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చింది.

Continue Reading

గాసిప్

మూడు పాత్రల్లోనూ మాస్ మహారాజానే

Published

on

By

మాస్ మహారాజా రవి తేజ మూడు పాత్రల్లో డిఫరెంట్ గెటప్స్ తో కనిపించబోతున్న చిత్రం ‘అమర్ అక్భర్ ఆంటోనీ. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో రవితేజ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ మూడు పాత్రలకు సంబంధించిన లుక్ ఇటీవల విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ పాత్రలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల వార్తలు వినిపస్తున్నాయి. తాజా ఇందులో ఓ పాత్రకు డాక్టర్లు నయం చేయలేని జబ్బు ఉంటుందట. అదే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత? అనేది తెలియాల్సి ఉంది.

Continue Reading

గాసిప్

రూమర్లను నమ్మకండి: రకుల్ ప్రీత్ సింగ్

Published

on

By

ఫ్యాషన్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లోకి అడుగుపెట్టిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న చిన్న అవకాశాలను అందుకొని మొదట్లో బాగా కష్టపడిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లిన రకుల్ బాలీవుడ్ , కోలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే అమ్మడికి తెలుగులో ప్లాప్స్ వల్ల అవకాశాలు తగ్గడంతో, ఇతర ఇండస్ట్రీపై ఎక్కువగా ద్రుష్టి పెట్టిందని అనేక రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ పై రకుల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. స్పైడర్ సినిమా అనంతరం తెలుగులో అవకాశాలు తగ్గడంవల్ల స్లో అయ్యారని వార్తలు వస్తున్నాయనే ప్రశ్నకు రకుల్ మాట్లాడుతూ.. స్లో అయ్యానని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే స్పైడర్ కి ముందు బిజీగా ఉన్నాను. ఆ సినిమా తరువాత కూడా వేరే సినిమాలకు ఒప్పుకున్నా. ముఖ్యంగా కోలీవుడ్ లో నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అందుకే టాలీవుడ్ లో మరో సినిమా చేయడం కుదరలేదు.

టాలీవుడ్ ను వదిలే సమస్యే లేదు
ఈ సంగతి అందరికి తెలిసినప్పటికీ మీడియా ఎందుకు రకుల్ కి అవకాశాల్లేవ్ అని కథనాలు ప్రచురించిందో?. తెలుగులో ఏడేళ్లలో 15 సినిమాలు చేశా. సక్సెస్ రేట్ సగమే ఉండవచ్చు కానీ ప్రేక్షకులు 75% మార్కులు వేశారు. నా కెరీర్ స్టార్ట్ అయ్యింది ఇక్కడే కాబట్టి టాలీవుడ్ ని వదిలే సమస్యే లేదు. అయినా అవకాశాల్లేవ్ అని ఎవరన్నారు? ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో తమిళంలో సూర్య ఎన్జీకే, కార్తీ 17 తో పాటు శివకార్తీకేయన్ తో కూడా నటిస్తున్నా. తెలుగులో వెంకీమామ సినిమాకు సైన్ చేశా. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను అంటూ అమ్మడు తన ప్రాజెక్టుల గురించి వివరిస్తూ రూమర్స్ చెక్ పెట్టింది.

Continue Reading

Trending