Connect with us

south బజ్

క‌ల‌ర్ ఫుల్ గా సాగిన మిస్ ఇండియా 2018

Published

on

మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలె ముంబైలో జ‌రిగింది. త‌మిళ‌నాడుకు చెందిన పందొమ్మిదేళ్ళ విద్యార్థిని అనుకృతి మిస్ ఇండియా 2018గా ఎంపికైంది. హ‌రియాణాకు చెందిన మీనాక్షి చౌద‌రి మొద‌టి ర‌న్న‌ర‌ప్ గా, ఆంధ్ర ప్ర‌దేశ్ కు చెందిన శ్రేయారావు రెండోర‌న్న‌ర‌ప్ గా నిలిచారు.  ఈ అందాల పోటీల‌కు క్రికెట‌ర్లు కె.ఎల్. రాహుల్, ఇర్ఫాన్ ప‌ఠాన్,  బాలీవుడ్ న‌టులు బాబీ డియోల్, మ‌లైకా అరోరా, కునాల్ కపూర్, గ‌త ఏడాది మిస్ ఇండియా మానుషి ఛిల్లార్ త‌దిత‌రులు న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. మానుషి త‌న కిరీటాన్ని అనుకృతికి తొడిగింది. భ‌విష్య‌త్తులో అనువాద‌కురాలు కావాల‌నుకుంటున్న‌ట్లు అనుకృతి చెప్పింది. కాగా మిస్ వ‌ర‌ల్డ్ 2018 పోటీల‌కు భార‌త్ నుంచి ప్రాతిన‌థ్యం వ‌హించ‌బోతోంది ఈ సుంద‌రి.

వినోద భ‌రితం: ఈ ఫినాలె ఆద్యంతం వినోద భ‌రితంగా జ‌రిగింది. బాలీవుడ్ ప్ర‌ముఖ తార‌లు ఈ ఫినాలెలో సంద‌డి చేశారు. మ‌నీష్ మ‌ల్హోత్ర డిజైన్ చేసిన దుస్తుల‌తో క‌రీనా క‌పూర్ ఖాన్ క‌నువిందు చేసింది. ఇంకా సీనియ‌ర్ న‌టి మాధురీ దీక్షిత్, నేహా ధూపియా, కండ‌లవీరుడు స‌ల్మాన్ ఖాన్, జాక్లిన్ ఫెర్నాండెజ్, ఆయుష్మాన్ ఖురానా, క‌ర‌ణ్ జోహ‌ర్ త‌దిత‌రుల‌తో ర‌స‌వ‌త్త‌రంగా సాగింది.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

south బజ్

ఈ నెల 28న హ్యాపి వెడ్డింగ్

Published

on

By

పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు అంటే జీవించినంత కాలం ఓక‌రినోక‌రు అర్ధం చేసుకుని ఎటువంటి మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జీవించాల‌ని అర్ధం. దీనికి ఇరు పెద్ద‌లు కూర్చుని చ‌క్క‌టి ముహుర్తాన్ని నిర్ణ‌యిస్తారు.. ముహుర్తం నిర్ణ‌యించిన ద‌గ్గ‌ర నుండి రెండు కుటుంబాల్లో వుండే హ‌డావుడి, సంతోషాలు, సంబరాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ముహుర్తం అంత గొప్ప‌ది.. అలాంటి ముహుర్తాన్ని యువి క్రియెష‌న్స్‌, పాకెట్ సినిమా వారు క‌లిసి సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక ల హ్య‌పివెడ్డింగ్ కి జులై 28 గా నిర్ణ‌యించారు. అంతే ఇటు ప్రోడ‌క్ష‌న్ హౌస్ లో ప్ర‌మోష‌న్ హ‌డావుడి మెద‌ల‌య్యింది. వెడ్డింగ్ ప్లాన‌ర్‌(పి.ఆర్‌.వో) ని రంగంలోకి దింపారు. ఏర్పాట్ల‌కి సిధ్ధం చేస్తున్నారు.. త్వ‌ర‌లోనే సంగీత్ కార్య‌క్ర‌మాలు(సాంగ్స్ విడుద‌ల‌), ప్రీ-వెడ్డింగ్ (ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్‌) ని కార్య‌క్ర‌మాన్ని అత్యంత గ్రాండ్ గా చేయాల‌ని నిర్ణ‌యించారు.

సుమంత్ అశ్విన్ నిహ‌రిక కొణిదెల నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా వారు పెళ్ళి పెద్ద‌లుగా ఈ హ్యాపివెడ్డింగ్ కి శ్రీకారాం చుట్టారు. పురోహితుడుగా యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య ఈ వివాహ‌న్ని చేస్తున్నాడు. మంగ‌ళ వాయిద్యాలు(సంగీతం) శక్తికాంత్ అందించగా, ఆర్కెస్ట్రా (రీరికార్డింగ్‌)- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ అందిస్తున్నారు. పోటోగ్ర‌ఫి బాల్ రెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాడు.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, ‘పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో జ‌రిగే విష‌య‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ఒక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం ఉంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌నితాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వ‌ర్గాల , అన్ని వ‌య‌సుల వారు ఈ చిత్రానికి క‌నెక్ట్ అవుతారు. ఈ చిత్రాన్ని జులై 28న విడుద‌ల చేస్తున్నాము’ అని అన్నారు..

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌ యువి క్రియేష‌న్స్
మ్యూజిక్ – శక్తికాంత్
రీ రీ రికార్డింగ్ – ఎస్. ఎస్. తమన్
కెమెరా – బాల్ రెడ్డి
మ్యూజిక్ – శ‌క్తికాంత్ కార్తిక్‌
నిర్మాత‌ – పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం – ల‌క్ష్మ‌ణ్ కార్య‌

Continue Reading

south బజ్

మనం సైతంకు సూపర్ స్టార్ కృష్ణ దంపతుల విరాళం…

Published

on

By

పేదలే ఆప్తులుగా వసుధైక కుటుంబంగా సాగుతున్న సేవా సంస్థ మనం సైతంలో నేనూ ఉన్నానంటూ ముందుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సతీమణి గిన్నీస్ బుక్ రికార్డ్స్ హోల్డర్ దర్శకురాలు విజయనిర్మలతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ మనం సైతంకు విరాళం అందజేశారు. కృష్ణ, విజయ నిర్మల చెరో 2 లక్షల రూపాయలు మనం సైతంకు అందజేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్లానెట్ 10లో గల కృష్ణ స్వగృహంలో మనం సైతం సభ్యులు కృష్ణ దంపతులను కలిశారు. ఈ సందర్భంగా ఐదుగురు ఆపన్నులకు మనం సైతం ఆర్థిక సహాయం అందించింది. లైట్ మెన్ ప్రవీణ్ కుమార్, చిరుద్యోగి ఎస్ రాజేందర్, ప్రసాద్ ల్యాబ్స్ లో పనిచేసే బాయ్ దుర్గారావు, ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేసే రాజ్ కుమార్ కొడుకు సోమేశ్వర్, రచయిత ప్రాణమిత్ర తదితరులు ఆర్థిక సహాయం పొందిన వాళ్లలో ఉన్నారు. వీళ్లలో కొందరికి అనారోగ్య చికిత్సకు, మరికొందరు చదువులకు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా కృష్ణ , విజయ నిర్మల మాట్లాడుతూ….కాదంబరి కిరణ్ మనం సైతంతో మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. నటుడిగా కొనసాగుతూ ఆయన సేవా కార్యక్రమాల్లో భాగమవడం సంతోషంగా ఉంది. అనారోగ్యంతో ఉన్నవాళ్లకు, చదువులు భారమైన పేదలకు మనం సైతం అండగా నిలబడుతోంది. ఈ సంస్థకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. అన్నారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…మా అమ్మ విజయ నిర్మల, పెద్దలు సూపర్ స్టార్ కృష్ణ గారు మనం సైతం కుటుబంలో భాగమై మా అందరికీ నీడగా మారినందుకు వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. గతంలో కేటీఆర్ చేతుల మీదుగా మా సంస్థ వెబ్ సైట్ ప్రారంభించాము. ఆ వెబ్ సైట్ వల్ల విదేశాల్లో ఉన్న దాతలు స్పందించారు. కిరణ్ కర్నాటీ, వెంకట్ సంఘీ, రామ్ నామగిరి లాంటి ఎన్ఆర్ఐలు మనం సైతంకు విరాళాలు పంపిస్తున్నారు. మనం సైతంకు పరిశ్రమ పెద్దలు, పాత్రికేయులు, రాజకీయ రంగ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు అండగా నిలబడుతుండటం మాకెంతో ధైర్యాన్నిస్తోంది. నన్ను నిత్యం వెన్నంటి ప్రోత్సహిస్తున్న మనం సైతం సహచరులకు కృతజ్ఞతలు. పేదవాడే నా కుటుంబం, పేదలకు ఆసరాగా నిలబడటమే నా జీవిత లక్ష్యమని నిర్ణయించుకున్నాను. మనం సైతం తీసుకునేవాళ్లకు బాగా చేరువవుతోంది. అలాగే దాతలకు కూడా చేరాలని కోరుకుంటున్నాను అన్నారు.

Continue Reading

south బజ్

నా పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటేనే…. నిడివి లేక‌పోయినా ఒప్పుకుంటాః అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్

Published

on

By

సినిమా చూస్తూ… అరే మ‌న ప‌క్కింటి అమ్మాయినే సినిమాలో చూస్తున్నామే… అనుకునేంత నాచురాలిటీని త‌న న‌ట‌న‌లో క‌న‌బ‌రుస్తూ ఒక ప్ర‌త్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది మ‌ల‌యాళీ బ్యూటీ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్. తొలి సినిమా ప్రేమ‌మ్ తోనే కుర్ర‌కారు మ‌న‌సులో తిష్ట వేసుకుని కూర్చున్న అనుప‌మా ఆ త‌రువాత అ..ఆ…, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, శ‌త‌మానం భ‌వ‌తీ అనే సినిమాల్లో న‌టించింది. తెలుగ‌మ్మాయిలా క‌నిపించే అనుప‌మా మ‌ల‌యాళం, త‌మిళ్ సినిమాల్లోనూ త‌న స‌త్తా చాటింది. ఇటీవ‌లే క‌న్న‌డ‌లోనూ అరంగేట్రం చేస్తోంది. తాజాగా తెలుగులో మెగా సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించిన సినిమా తేజ్. ఐ ల‌వ్ యూ… ఉప శీర్షిక‌. జులై 6న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా త‌న సినీ కెరీర్, భ‌విష్య‌త్తు గురించిన ఎన్నో అంశాల‌ను తెలుగు సినీబ‌జ్ తో పంచుకుంది. ఆ విశేషాలు…

ప్రః హాయ్ అనుప‌మా..!
జః హాయ్ అండీ.

ప్రః తెలుగులో ఇంత చ‌క్క‌గా మాట్లాడుతున్నారే!
జః అవునా. థాంక్సండీ. ఇదంతా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గారి చ‌ల‌వే. అ..ఆ.. సినిమా చేసేప్పుడు సెట్స్ లో అంద‌రూ తెలుగులో మాట్లాడుతూనే ఉండేవారు. నాకేమో అస్స‌లు అర్థం అయ్యేది కాదు. కాస్త బాధ‌ప‌డుతూ ఉండేదాన్ని. ఇదే విష‌యాన్ని డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రావు గారితో చెప్పి, నాకు కాస్త నేర్పించండి అని కోరాను. అప్ప‌టి నుంచి సినిమా పూర్త‌య్యే దాకా నాకు ప్ర‌తి మాట‌ను తెలుగులో అనువదించి, అది ఎలా ప‌ల‌కాలో కూడా నేర్పించారు. ఆయ‌న‌ను తెలుగు గురువుగారు అని భావిస్తాను. ఆ త‌రువాత నా స్టాఫ్ తో కూడా తెలుగులోనే మాట్లాడుతూ మాట్లాడుతూ… ఇదిగో.. ఇలా మీతో కూడా మాట్లాడేస్తున్నాను.(న‌వ్వుతూ) త‌మిళ్ లో సినిమా చేస్తుంటే ఎక్క‌వ‌గా తెలుగు ప‌దాలు వ‌చ్చేస్తున్నాయి.

ప్రః తేజ్… సినిమా విశేషాలేమిటి?
జః సినిమాలో నా పాత్ర పేరు నందిని. అమెరికా నుంచి ఒక ప‌ర్ప‌స్ కోసం హైద‌రాబాద్ కు వ‌స్తుంది. సూప‌ర్ మోడ‌ర్న్ గ‌ర్ల్. బ‌బ్లీగా, ఇమ్మెచ్యూర్ గా క‌నిపిస్తాను. కొన్నిసార్లు డేరింగ్ ఆండ్ డాషింగ్ గా, మ‌రికొన్నిసార్లు ఎంతో స్థిరంగా క‌నిపిస్తాను. ఇలా.. నా పాత్ర‌లో ఎన్నో వేరియేష‌న్స్ ఉంటాయి. సాయి ధ‌ర‌మ్ తేజ్ తో యాక్ట్ చేయ‌డం బాగా అనిపించింది. సూప‌ర్ డ్యాన్స‌ర్ త‌ను. నాకు ఇంత వ‌ర‌కూ అంత డ్యాన్స్ పెర్ఫార్మ్ చేయాల్సిన అవ‌కాశం రాలేదు. దీంతో సాయి ధ‌ర‌మ్ తేజ్ డ్యాన్స్ చేసేప్పుడు కొంత క‌ష్ట‌ప‌డాల్సి వచ్చింది. నాకు క్లాసిక‌ల్ డాన్స్ ట‌చ్ ఉంది. కానీ, సినిమాలో డిఫ‌రెంట్ క‌దా. సో… ఎలా చేశానో అనే టెన్ష‌న్ అయితే ఉంది. మీరంతా సినిమా చూసి ఎలా చేసానో చెప్పాలి.

ప్రః సాయి ధ‌ర‌మ్ తేజ్ డాన్స్ లో ఏమైనా టిప్స్ చెప్పారా?
జః నిజానికి సాయి ధ‌ర‌మ్ తేజ్ సూప‌ర్ యాక్ట‌ర్. కూల్ అని చెప్పొచ్చు. ఎంత ఎన‌ర్జిటిక్ గా ఉంటారో. పైగా సెట్స్ లో భ‌లే ప్ర‌శాంతంగా ఉంటారు. షాట్ ఓకే అయిన త‌రువాత ఎలా వ‌చ్చిందో ఈ షాట్ చూద్దామ‌ని డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కెళ్ళి, రివైండ్ చేసి చూస్తుంటాం జ‌న‌ర‌ల్ గా. కానీ, ఆయ‌న అస‌లు ఆ ప‌ని చేయ‌లేదు. డైరెక్ట‌ర్ క‌న్నా మ‌న‌కు ఎక్కువ తెలుసా… అని అనుకుంటూ, డైరెక్ట‌ర్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటారాయ‌న‌. నిజంగా ఇది గొప్ప విష‌యం. డాన్స్ టిప్స్ అంటే… క్లాసిక‌ల్ డాన్స్ వ‌చ్చు గ‌నుక‌.. నాకు స్పీడ్ మూమెంట్స్ ఎలా చేయాలో చెప్తుండేవాడు. అత‌ను మంచి స‌హ‌న‌టుడు.

ప్రః మీరు మెయిన్ హీరోయిన్ గా చేసిన సినిమాలు త‌క్కువ‌గా ఉన్నాయి?
జః ఒక విష‌యం చెప్తాను. నేను ఆర్టిస్ట్ ని. నా క్యారెక్ట‌ర్ నిడివి ఒక సీన్ ఉందా? రెండు సీన్సా… లేక మొత్తం సినిమానా? అనేది ప‌ట్టించుకోను. ఆ సినిమాలో నా పాత్ర ఎలా ఉంది అనేదే నాకు ముఖ్యం. ఇద్ద‌రు హీరోయిన్లున్నా, ముగ్గురు ఉన్నా… నా క్యారెక్ట‌ర్ కు ప్రాధాన్య‌త లేక‌పోతే నేను న‌టించ‌ను. నాకు పాత్ర‌ల ప‌రంగా స్వార్థ‌మెక్కువ‌(న‌వ్వు). ఉన్న‌ది ఒక‌టే జింద‌గీలో నేను స‌గం సినిమానే ఉన్నాను. అయితే ఏం. నా క్యారెక్ట‌ర్ బాగా ఉంది. అ..ఆ.. క‌నిపించేది రెండు, మూడు సీన్లే… కానీ, బాగా పేరొచ్చింది క‌దా. నా న‌ట‌న బాగుంది క‌దా? శ‌త‌మానం భ‌వతి ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్. పెర్ఫార్మెన్స్ కే ప్రాధాన్య‌త‌నిస్తా.

ప్రః న‌టిస్తున్నారు. పాట‌లు కూడా పాడ‌తారు. డ‌బ్బింగ్ కూడా మీరే క‌దా?
జః పాట‌లు మామూలుగా పాడుతూంటాను. సినిమాల్లో కాదులేండి. న‌ట‌నే నా మెయిన్ స్ట్రీమ్. డ‌బ్బింగ్ నా సినిమాల‌కు నేనే చెప్పుకుంటున్నాను. కానీ, తేజ్… సినిమాకు మాత్రం నాది కాదు. కొన్ని సార్లు డేట్స్ స‌మ‌స్య వ‌ల్ల చెప్పడం కుద‌ర‌దు.

ప్రః ఇండ‌స్ట్రీలో పోటీ ఎక్కువ‌గా ఉంది క‌దా? సంప్ర‌దాయంగా క‌నిపిస్తూ ముందుకెళ్ళ‌గ‌ల‌న‌నుకుంటున్నారా?
జః నేను న‌టించిన ప్ర‌తి సినిమాలో మోడ‌ర్న్ గానే క‌నిపించాను క‌దా. గ్లామ‌ర్ గా క‌నిపించ‌డ‌మంటే చిట్టి పొట్టి దుస్తులు ధ‌రించ‌డంలోనే ఉంటుంద‌ని నేన‌నుకోవ‌డంలేదు. ఆధునికంగా, అందంగా క‌నిపించ‌డ‌మే నా దృష్టిలో గ్లామ‌ర్. అది నాకు స‌మ‌స్య‌గా లేదు. అయితే పాత్ర‌లే అద్భుతంగా ఉండాలి. అప్పుడే మ‌న‌మేంటి అనేది తెలుస్తుంది. అయినా, న‌టీన‌టుల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఎప్పుడూ మంచే చేస్తుంది.

ప్రః పాత్ర‌ల ఎంపిక ఎలా చేసుకుంటున్నారు?
జః సినిమాలో నా పాత్రకు ప్రాధాన్య‌త ఉందా? లేదా? అనేది చూసుకుంటాను. అయితే చాలా చాలా మంచి పాత్ర‌లు పోషించాల్సి ఉంది. స‌మ్మోహ‌నం సినిమా చూడ‌గానే అదితి రావు హైద‌రీకి ఫోన్ చేసి చెప్పా… అద్భుతంగా ఉంది సినిమా అని. అదితి పోషించిన‌టువంటి పాత్ర‌, మ‌హాన‌టిలో కీర్తి సురేష్ పోషించిన పాత్ర.. రంగ‌స్థ‌లంలో స‌మంత పోషించిన పాత్ర‌. ఇవ‌న్నీ చూస్తుంటే… హీరోయిన్ల పాత్ర‌ల‌కు కాస్త ప్రాధాన్య‌త పెరిగింద‌నిపిస్తోంది. ఇది మంచి టైం అని అనుకుంటున్నాను.

ప్రః రంగ‌స్థ‌లం అవ‌కాశం చేజారింద‌ని బాధ ఉందా?
జః అయ్యో..! అస్స‌లు లేదు. ఎవ‌రికి రావ‌లిసిన పాత్ర‌లు వారికొస్తాయి. రంగ‌స్థ‌లం సినిమా చూడ‌గానే సుకుమార్ గారికి కాల్ చేశాను. రామ‌ల‌క్ష్మిగా నా క‌న్నా స‌మంతా నే అందంగా ఉంది అని చెప్పాను. డేట్స్ స‌మ‌స్య‌తో కొన్ని కొన్ని సినిమాలు మిస్ అవుతున్నాయి. అయితే, ఎవ‌రికి రాసి పెట్టి ఉన్న పాత్ర‌లు వారికొస్తాయి.

ప్రః క‌న్న‌డ ప్ర‌వేశం ఎలా ఉంది?
జః అడుగు పెట్టిన చోట‌ల్లా ముందు భాష స‌మ‌స్య‌నే(న‌వ్వు). క‌న్న‌డ నేర్చ‌కుంటున్నానిప్పుడు. తెలుగు భాష బాగా కంఫ‌ర్ట్ అయిపోయింది. క‌న్న‌డలో ప్ర‌వేశం త‌రువాత ఆ భాష కూడా బాగా నేర్చేసుకుంటా. ఇలా ఇండ‌స్ట్రీ మారుతున్నంత‌సేపు కొత్త ప్ర‌దేశాలు, కొత్త మ‌నుషులతోపాటు, కొత్త భాష‌లు నేర్చుకోవ‌డం ఎంత బాగుంటుందో.

ప్రః బాలీవుడ్ ప్ర‌వేశం గురించిన ఆలోచ‌న ఉందా?
జః లేదండి. ఇక్క‌డే డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోతున్నాను. అయినా బాలీవుడ్ వాళ్ళ‌కు నేనంటూ ఒక‌దాన్ని ఉన్నాన‌ని తెలియాలి. వాళ్ళు న‌న్ను అడ‌గాలి. అప్పుడు నేను చూడాలి. ఇప్ప‌టికైతే దాని గురించిన ఆలోచ‌న‌లైతే లేవు.

ప్రః ఇంకా ఏయే సినిమాలు చేస్తున్నారు?
జః న‌క్కిన త్రినాథ రావు ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో గురూ ప్రేమ కోస‌మే చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎవ‌డో ఒక‌డు, క‌న్న‌డ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ వ‌డియార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌ట సార్వ‌భౌమ చిత్రాలు ప్రీ పొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉన్నాయి. మ‌ల‌యాళంలో చాలా అవ‌కాశాలు వ‌చ్చినా అప్ప‌టికే తెలుగులోనో, త‌మిళ్ లోనో ఒప్పుకుని ఉన్న సినిమాలు ఉండ‌డంతో, మాతృభాష అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికి ప్రేమ‌మ్ సినిమా ఒక్క‌టే అయింది. భ‌విష్య‌త్తులో అన్ని భాష‌ల‌కు స‌మ‌ప్రాధాన్య‌త‌నిస్తాను.

Continue Reading

Trending