Connect with us

గాసిప్

కిమ్ శర్మతో హర్షవర్ధన్ రాణే డేటింగ్.. పబ్లిక్‌గా దొరికిన జంట.. జ్వాలాకు గుడ్‌బై!

Published

on

టాలీవుడ్, బాలీవుడ్‌లో అప్పుడప్పుడు కనిపిస్తుండే హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటి కిమ్ శర్మ మధ్య అఫైర్ జోరుగా సాగుతున్నట్టు కనిపిస్తున్నది. వీరిద్దరూ లంచ్ డేట్‌కు వచ్చి ముంబైలోని ఓ విలాసవంతమైన రెస్టారెంట్‌లో ఫోటో జర్నలిస్టుల కంటికి చిక్కారు. మీడియా హడావిడి చూసి వీరద్దరి ఒంటరిగా కూర్చొవడం కనిపించింది. ఒంటరిగా నవ్వుతూ వీరద్దరి ఫొటోలకు ఫోజిచ్చారట. అనంతరం ఇద్దరు కలిసి మూవీకి వెళ్లినట్టు మీడియా కథనం వచ్చింది. వివారాల్లోకి వెళితే..

హర్షవర్ధన్‌ రాణేతో కిమ్ శర్మ
ముంబైలోని బాంద్రా రెస్టారెంట్‌లో జంటగా కనిపించిన కిమ్ శర్మ, హర్షవర్ధన్ రాణేను మీడియా పలుకరించగా పెద్దగా మాట్లాడటానికి నిరాకరించారట. హర్షవర్ధన్ రాణే నటించిన పల్టాన్ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజైంది. ఆ సందర్భంగానే లంచ్ డేట్‌కు వచ్చినట్టు తెలుస్తున్నది. వీరిద్దరి వ్యవహారం గత కొద్దినెలలుగా మీడియాలో చర్చనీయాంశమైంది.

అలీ పుంజానీతో కిమ్ శర్మ పెళ్లి బాలీవుడ్‌లో కెరీర్ ఉన్నతస్థానంలో ఉండగా, అలీ పుంజానీని కిమ్ శర్మ వివాహం చేసుకొన్నారు. కెన్యాలో అలీ పుంజానీ బడా వ్యాపారవేత్త. వివాహం తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిపోయారు.

భర్తను వదిలేసి కిమ్ శర్మ గొడవల మధ్య చేతిలో చిల్లిగవ్వ లేకుండా భార్తను వదిలేసి కిమ్ శర్మ ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఓ మోడల్‌తో అఫైర్ పెట్టుకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా హర్షవర్ధన్‌తో కలిసి తిరుగుతూ మీడియాను ఆకర్షించింది.

గౌహర్‌తో హర్షవర్ధన్ ఇక తొలుత హర్షవర్ధన్ రాణేకు బాలీవుడ్ నటి గౌహర్‌ఖాన్‌తో అఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్‌లో చిన్నా చితక హీరో వేషాలు వేస్తున్న తరుణంలో బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాతో అఫైర్ ఉందంటూ వార్తలు వెలుగు చేశాయి. అయితే వాటికి మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.

గుత్తా జ్వాలాతో హర్షవర్దన్ అఫైర్ సినీ పరిశ్రమలో స్థిరమైన స్థానం సంపాదించుకొనేందుకు ఓ వైపు ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరోవైపు అందమైన భామలతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం హర్షవర్ధన్‌కు అలవాటుగా మారింది. సనమ్ తెరీ కసమ్‌లో నటించిన హీరోయిన్ మార్వా హోకేన్‌తో అఫైర్ నడిపించాడనే వార్తలు కూడా హల్‌చల్ సృష్టించాయి.

ఖడ్గం చిత్రంలో కిమ్ శర్మ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం చిత్రంలో కిమ్ శర్మ హీరోయిన్‌గా నటించింది. రవితేజ చిత్రం ఆంజనేయులులో ఐటమ్ నంబర్‌లో కనిపించింది. తెలుగులో చివరిసారిగా మగధీర సినిమాలో ఓ ఐటెంగ్ సాంగ్‌లో ఆకట్టుకొన్నది.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గాసిప్

రాజశేఖర్ ‘కల్కి’ కోసం 2 కోట్లతో సెట్.. 1980 నాటి తెలంగాణ..

Published

on

By

పీఎస్వీ గరుడవేగ బ్లాక్బస్టర్తో యాంగ్రీ యంగ్మ్యాన్ రాజశేఖర్ జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం అ! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో కల్కి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కల్కి చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్రం కోసం భారీ సెట్ను నిర్మించినట్టు తెలుస్తున్నది. సినిమాలో కీలకంగా మారడంతో ఈ సెట్ను 2 కోట్లతో రూపొందించినట్టు తెలిసింది. 1980 దశకంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ను ప్రతిబింబించేలా వాతావరణాన్ని క్రియేట్ చేసినట్టు సమాచారం.

తెలంగాణ ప్రాంతంలోనే చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చింది.

Continue Reading

గాసిప్

మూడు పాత్రల్లోనూ మాస్ మహారాజానే

Published

on

By

మాస్ మహారాజా రవి తేజ మూడు పాత్రల్లో డిఫరెంట్ గెటప్స్ తో కనిపించబోతున్న చిత్రం ‘అమర్ అక్భర్ ఆంటోనీ. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో రవితేజ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ మూడు పాత్రలకు సంబంధించిన లుక్ ఇటీవల విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ పాత్రలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల వార్తలు వినిపస్తున్నాయి. తాజా ఇందులో ఓ పాత్రకు డాక్టర్లు నయం చేయలేని జబ్బు ఉంటుందట. అదే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత? అనేది తెలియాల్సి ఉంది.

Continue Reading

గాసిప్

రూమర్లను నమ్మకండి: రకుల్ ప్రీత్ సింగ్

Published

on

By

ఫ్యాషన్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లోకి అడుగుపెట్టిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న చిన్న అవకాశాలను అందుకొని మొదట్లో బాగా కష్టపడిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లిన రకుల్ బాలీవుడ్ , కోలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే అమ్మడికి తెలుగులో ప్లాప్స్ వల్ల అవకాశాలు తగ్గడంతో, ఇతర ఇండస్ట్రీపై ఎక్కువగా ద్రుష్టి పెట్టిందని అనేక రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ పై రకుల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. స్పైడర్ సినిమా అనంతరం తెలుగులో అవకాశాలు తగ్గడంవల్ల స్లో అయ్యారని వార్తలు వస్తున్నాయనే ప్రశ్నకు రకుల్ మాట్లాడుతూ.. స్లో అయ్యానని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే స్పైడర్ కి ముందు బిజీగా ఉన్నాను. ఆ సినిమా తరువాత కూడా వేరే సినిమాలకు ఒప్పుకున్నా. ముఖ్యంగా కోలీవుడ్ లో నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అందుకే టాలీవుడ్ లో మరో సినిమా చేయడం కుదరలేదు.

టాలీవుడ్ ను వదిలే సమస్యే లేదు
ఈ సంగతి అందరికి తెలిసినప్పటికీ మీడియా ఎందుకు రకుల్ కి అవకాశాల్లేవ్ అని కథనాలు ప్రచురించిందో?. తెలుగులో ఏడేళ్లలో 15 సినిమాలు చేశా. సక్సెస్ రేట్ సగమే ఉండవచ్చు కానీ ప్రేక్షకులు 75% మార్కులు వేశారు. నా కెరీర్ స్టార్ట్ అయ్యింది ఇక్కడే కాబట్టి టాలీవుడ్ ని వదిలే సమస్యే లేదు. అయినా అవకాశాల్లేవ్ అని ఎవరన్నారు? ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో తమిళంలో సూర్య ఎన్జీకే, కార్తీ 17 తో పాటు శివకార్తీకేయన్ తో కూడా నటిస్తున్నా. తెలుగులో వెంకీమామ సినిమాకు సైన్ చేశా. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను అంటూ అమ్మడు తన ప్రాజెక్టుల గురించి వివరిస్తూ రూమర్స్ చెక్ పెట్టింది.

Continue Reading

Trending