Connect with us

south బజ్

ఈ నెల 28న హ్యాపి వెడ్డింగ్

Published

on

పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు అంటే జీవించినంత కాలం ఓక‌రినోక‌రు అర్ధం చేసుకుని ఎటువంటి మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జీవించాల‌ని అర్ధం. దీనికి ఇరు పెద్ద‌లు కూర్చుని చ‌క్క‌టి ముహుర్తాన్ని నిర్ణ‌యిస్తారు.. ముహుర్తం నిర్ణ‌యించిన ద‌గ్గ‌ర నుండి రెండు కుటుంబాల్లో వుండే హ‌డావుడి, సంతోషాలు, సంబరాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ముహుర్తం అంత గొప్ప‌ది.. అలాంటి ముహుర్తాన్ని యువి క్రియెష‌న్స్‌, పాకెట్ సినిమా వారు క‌లిసి సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక ల హ్య‌పివెడ్డింగ్ కి జులై 28 గా నిర్ణ‌యించారు. అంతే ఇటు ప్రోడ‌క్ష‌న్ హౌస్ లో ప్ర‌మోష‌న్ హ‌డావుడి మెద‌ల‌య్యింది. వెడ్డింగ్ ప్లాన‌ర్‌(పి.ఆర్‌.వో) ని రంగంలోకి దింపారు. ఏర్పాట్ల‌కి సిధ్ధం చేస్తున్నారు.. త్వ‌ర‌లోనే సంగీత్ కార్య‌క్ర‌మాలు(సాంగ్స్ విడుద‌ల‌), ప్రీ-వెడ్డింగ్ (ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్‌) ని కార్య‌క్ర‌మాన్ని అత్యంత గ్రాండ్ గా చేయాల‌ని నిర్ణ‌యించారు.

సుమంత్ అశ్విన్ నిహ‌రిక కొణిదెల నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా వారు పెళ్ళి పెద్ద‌లుగా ఈ హ్యాపివెడ్డింగ్ కి శ్రీకారాం చుట్టారు. పురోహితుడుగా యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య ఈ వివాహ‌న్ని చేస్తున్నాడు. మంగ‌ళ వాయిద్యాలు(సంగీతం) శక్తికాంత్ అందించగా, ఆర్కెస్ట్రా (రీరికార్డింగ్‌)- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ అందిస్తున్నారు. పోటోగ్ర‌ఫి బాల్ రెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాడు.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, ‘పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో జ‌రిగే విష‌య‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ఒక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం ఉంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌నితాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వ‌ర్గాల , అన్ని వ‌య‌సుల వారు ఈ చిత్రానికి క‌నెక్ట్ అవుతారు. ఈ చిత్రాన్ని జులై 28న విడుద‌ల చేస్తున్నాము’ అని అన్నారు..

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌ యువి క్రియేష‌న్స్
మ్యూజిక్ – శక్తికాంత్
రీ రీ రికార్డింగ్ – ఎస్. ఎస్. తమన్
కెమెరా – బాల్ రెడ్డి
మ్యూజిక్ – శ‌క్తికాంత్ కార్తిక్‌
నిర్మాత‌ – పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం – ల‌క్ష్మ‌ణ్ కార్య‌

south బజ్

మనం సైతంకు సూపర్ స్టార్ కృష్ణ దంపతుల విరాళం…

Published

on

By

పేదలే ఆప్తులుగా వసుధైక కుటుంబంగా సాగుతున్న సేవా సంస్థ మనం సైతంలో నేనూ ఉన్నానంటూ ముందుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సతీమణి గిన్నీస్ బుక్ రికార్డ్స్ హోల్డర్ దర్శకురాలు విజయనిర్మలతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ మనం సైతంకు విరాళం అందజేశారు. కృష్ణ, విజయ నిర్మల చెరో 2 లక్షల రూపాయలు మనం సైతంకు అందజేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్లానెట్ 10లో గల కృష్ణ స్వగృహంలో మనం సైతం సభ్యులు కృష్ణ దంపతులను కలిశారు. ఈ సందర్భంగా ఐదుగురు ఆపన్నులకు మనం సైతం ఆర్థిక సహాయం అందించింది. లైట్ మెన్ ప్రవీణ్ కుమార్, చిరుద్యోగి ఎస్ రాజేందర్, ప్రసాద్ ల్యాబ్స్ లో పనిచేసే బాయ్ దుర్గారావు, ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేసే రాజ్ కుమార్ కొడుకు సోమేశ్వర్, రచయిత ప్రాణమిత్ర తదితరులు ఆర్థిక సహాయం పొందిన వాళ్లలో ఉన్నారు. వీళ్లలో కొందరికి అనారోగ్య చికిత్సకు, మరికొందరు చదువులకు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా కృష్ణ , విజయ నిర్మల మాట్లాడుతూ….కాదంబరి కిరణ్ మనం సైతంతో మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. నటుడిగా కొనసాగుతూ ఆయన సేవా కార్యక్రమాల్లో భాగమవడం సంతోషంగా ఉంది. అనారోగ్యంతో ఉన్నవాళ్లకు, చదువులు భారమైన పేదలకు మనం సైతం అండగా నిలబడుతోంది. ఈ సంస్థకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. అన్నారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…మా అమ్మ విజయ నిర్మల, పెద్దలు సూపర్ స్టార్ కృష్ణ గారు మనం సైతం కుటుబంలో భాగమై మా అందరికీ నీడగా మారినందుకు వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. గతంలో కేటీఆర్ చేతుల మీదుగా మా సంస్థ వెబ్ సైట్ ప్రారంభించాము. ఆ వెబ్ సైట్ వల్ల విదేశాల్లో ఉన్న దాతలు స్పందించారు. కిరణ్ కర్నాటీ, వెంకట్ సంఘీ, రామ్ నామగిరి లాంటి ఎన్ఆర్ఐలు మనం సైతంకు విరాళాలు పంపిస్తున్నారు. మనం సైతంకు పరిశ్రమ పెద్దలు, పాత్రికేయులు, రాజకీయ రంగ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు అండగా నిలబడుతుండటం మాకెంతో ధైర్యాన్నిస్తోంది. నన్ను నిత్యం వెన్నంటి ప్రోత్సహిస్తున్న మనం సైతం సహచరులకు కృతజ్ఞతలు. పేదవాడే నా కుటుంబం, పేదలకు ఆసరాగా నిలబడటమే నా జీవిత లక్ష్యమని నిర్ణయించుకున్నాను. మనం సైతం తీసుకునేవాళ్లకు బాగా చేరువవుతోంది. అలాగే దాతలకు కూడా చేరాలని కోరుకుంటున్నాను అన్నారు.

Continue Reading

south బజ్

నా పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటేనే…. నిడివి లేక‌పోయినా ఒప్పుకుంటాః అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్

Published

on

By

సినిమా చూస్తూ… అరే మ‌న ప‌క్కింటి అమ్మాయినే సినిమాలో చూస్తున్నామే… అనుకునేంత నాచురాలిటీని త‌న న‌ట‌న‌లో క‌న‌బ‌రుస్తూ ఒక ప్ర‌త్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది మ‌ల‌యాళీ బ్యూటీ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్. తొలి సినిమా ప్రేమ‌మ్ తోనే కుర్ర‌కారు మ‌న‌సులో తిష్ట వేసుకుని కూర్చున్న అనుప‌మా ఆ త‌రువాత అ..ఆ…, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, శ‌త‌మానం భ‌వ‌తీ అనే సినిమాల్లో న‌టించింది. తెలుగ‌మ్మాయిలా క‌నిపించే అనుప‌మా మ‌ల‌యాళం, త‌మిళ్ సినిమాల్లోనూ త‌న స‌త్తా చాటింది. ఇటీవ‌లే క‌న్న‌డ‌లోనూ అరంగేట్రం చేస్తోంది. తాజాగా తెలుగులో మెగా సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించిన సినిమా తేజ్. ఐ ల‌వ్ యూ… ఉప శీర్షిక‌. జులై 6న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా త‌న సినీ కెరీర్, భ‌విష్య‌త్తు గురించిన ఎన్నో అంశాల‌ను తెలుగు సినీబ‌జ్ తో పంచుకుంది. ఆ విశేషాలు…

ప్రః హాయ్ అనుప‌మా..!
జః హాయ్ అండీ.

ప్రః తెలుగులో ఇంత చ‌క్క‌గా మాట్లాడుతున్నారే!
జః అవునా. థాంక్సండీ. ఇదంతా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గారి చ‌ల‌వే. అ..ఆ.. సినిమా చేసేప్పుడు సెట్స్ లో అంద‌రూ తెలుగులో మాట్లాడుతూనే ఉండేవారు. నాకేమో అస్స‌లు అర్థం అయ్యేది కాదు. కాస్త బాధ‌ప‌డుతూ ఉండేదాన్ని. ఇదే విష‌యాన్ని డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రావు గారితో చెప్పి, నాకు కాస్త నేర్పించండి అని కోరాను. అప్ప‌టి నుంచి సినిమా పూర్త‌య్యే దాకా నాకు ప్ర‌తి మాట‌ను తెలుగులో అనువదించి, అది ఎలా ప‌ల‌కాలో కూడా నేర్పించారు. ఆయ‌న‌ను తెలుగు గురువుగారు అని భావిస్తాను. ఆ త‌రువాత నా స్టాఫ్ తో కూడా తెలుగులోనే మాట్లాడుతూ మాట్లాడుతూ… ఇదిగో.. ఇలా మీతో కూడా మాట్లాడేస్తున్నాను.(న‌వ్వుతూ) త‌మిళ్ లో సినిమా చేస్తుంటే ఎక్క‌వ‌గా తెలుగు ప‌దాలు వ‌చ్చేస్తున్నాయి.

ప్రః తేజ్… సినిమా విశేషాలేమిటి?
జః సినిమాలో నా పాత్ర పేరు నందిని. అమెరికా నుంచి ఒక ప‌ర్ప‌స్ కోసం హైద‌రాబాద్ కు వ‌స్తుంది. సూప‌ర్ మోడ‌ర్న్ గ‌ర్ల్. బ‌బ్లీగా, ఇమ్మెచ్యూర్ గా క‌నిపిస్తాను. కొన్నిసార్లు డేరింగ్ ఆండ్ డాషింగ్ గా, మ‌రికొన్నిసార్లు ఎంతో స్థిరంగా క‌నిపిస్తాను. ఇలా.. నా పాత్ర‌లో ఎన్నో వేరియేష‌న్స్ ఉంటాయి. సాయి ధ‌ర‌మ్ తేజ్ తో యాక్ట్ చేయ‌డం బాగా అనిపించింది. సూప‌ర్ డ్యాన్స‌ర్ త‌ను. నాకు ఇంత వ‌ర‌కూ అంత డ్యాన్స్ పెర్ఫార్మ్ చేయాల్సిన అవ‌కాశం రాలేదు. దీంతో సాయి ధ‌ర‌మ్ తేజ్ డ్యాన్స్ చేసేప్పుడు కొంత క‌ష్ట‌ప‌డాల్సి వచ్చింది. నాకు క్లాసిక‌ల్ డాన్స్ ట‌చ్ ఉంది. కానీ, సినిమాలో డిఫ‌రెంట్ క‌దా. సో… ఎలా చేశానో అనే టెన్ష‌న్ అయితే ఉంది. మీరంతా సినిమా చూసి ఎలా చేసానో చెప్పాలి.

ప్రః సాయి ధ‌ర‌మ్ తేజ్ డాన్స్ లో ఏమైనా టిప్స్ చెప్పారా?
జః నిజానికి సాయి ధ‌ర‌మ్ తేజ్ సూప‌ర్ యాక్ట‌ర్. కూల్ అని చెప్పొచ్చు. ఎంత ఎన‌ర్జిటిక్ గా ఉంటారో. పైగా సెట్స్ లో భ‌లే ప్ర‌శాంతంగా ఉంటారు. షాట్ ఓకే అయిన త‌రువాత ఎలా వ‌చ్చిందో ఈ షాట్ చూద్దామ‌ని డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కెళ్ళి, రివైండ్ చేసి చూస్తుంటాం జ‌న‌ర‌ల్ గా. కానీ, ఆయ‌న అస‌లు ఆ ప‌ని చేయ‌లేదు. డైరెక్ట‌ర్ క‌న్నా మ‌న‌కు ఎక్కువ తెలుసా… అని అనుకుంటూ, డైరెక్ట‌ర్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటారాయ‌న‌. నిజంగా ఇది గొప్ప విష‌యం. డాన్స్ టిప్స్ అంటే… క్లాసిక‌ల్ డాన్స్ వ‌చ్చు గ‌నుక‌.. నాకు స్పీడ్ మూమెంట్స్ ఎలా చేయాలో చెప్తుండేవాడు. అత‌ను మంచి స‌హ‌న‌టుడు.

ప్రః మీరు మెయిన్ హీరోయిన్ గా చేసిన సినిమాలు త‌క్కువ‌గా ఉన్నాయి?
జః ఒక విష‌యం చెప్తాను. నేను ఆర్టిస్ట్ ని. నా క్యారెక్ట‌ర్ నిడివి ఒక సీన్ ఉందా? రెండు సీన్సా… లేక మొత్తం సినిమానా? అనేది ప‌ట్టించుకోను. ఆ సినిమాలో నా పాత్ర ఎలా ఉంది అనేదే నాకు ముఖ్యం. ఇద్ద‌రు హీరోయిన్లున్నా, ముగ్గురు ఉన్నా… నా క్యారెక్ట‌ర్ కు ప్రాధాన్య‌త లేక‌పోతే నేను న‌టించ‌ను. నాకు పాత్ర‌ల ప‌రంగా స్వార్థ‌మెక్కువ‌(న‌వ్వు). ఉన్న‌ది ఒక‌టే జింద‌గీలో నేను స‌గం సినిమానే ఉన్నాను. అయితే ఏం. నా క్యారెక్ట‌ర్ బాగా ఉంది. అ..ఆ.. క‌నిపించేది రెండు, మూడు సీన్లే… కానీ, బాగా పేరొచ్చింది క‌దా. నా న‌ట‌న బాగుంది క‌దా? శ‌త‌మానం భ‌వతి ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్. పెర్ఫార్మెన్స్ కే ప్రాధాన్య‌త‌నిస్తా.

ప్రః న‌టిస్తున్నారు. పాట‌లు కూడా పాడ‌తారు. డ‌బ్బింగ్ కూడా మీరే క‌దా?
జః పాట‌లు మామూలుగా పాడుతూంటాను. సినిమాల్లో కాదులేండి. న‌ట‌నే నా మెయిన్ స్ట్రీమ్. డ‌బ్బింగ్ నా సినిమాల‌కు నేనే చెప్పుకుంటున్నాను. కానీ, తేజ్… సినిమాకు మాత్రం నాది కాదు. కొన్ని సార్లు డేట్స్ స‌మ‌స్య వ‌ల్ల చెప్పడం కుద‌ర‌దు.

ప్రః ఇండ‌స్ట్రీలో పోటీ ఎక్కువ‌గా ఉంది క‌దా? సంప్ర‌దాయంగా క‌నిపిస్తూ ముందుకెళ్ళ‌గ‌ల‌న‌నుకుంటున్నారా?
జః నేను న‌టించిన ప్ర‌తి సినిమాలో మోడ‌ర్న్ గానే క‌నిపించాను క‌దా. గ్లామ‌ర్ గా క‌నిపించ‌డ‌మంటే చిట్టి పొట్టి దుస్తులు ధ‌రించ‌డంలోనే ఉంటుంద‌ని నేన‌నుకోవ‌డంలేదు. ఆధునికంగా, అందంగా క‌నిపించ‌డ‌మే నా దృష్టిలో గ్లామ‌ర్. అది నాకు స‌మ‌స్య‌గా లేదు. అయితే పాత్ర‌లే అద్భుతంగా ఉండాలి. అప్పుడే మ‌న‌మేంటి అనేది తెలుస్తుంది. అయినా, న‌టీన‌టుల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఎప్పుడూ మంచే చేస్తుంది.

ప్రః పాత్ర‌ల ఎంపిక ఎలా చేసుకుంటున్నారు?
జః సినిమాలో నా పాత్రకు ప్రాధాన్య‌త ఉందా? లేదా? అనేది చూసుకుంటాను. అయితే చాలా చాలా మంచి పాత్ర‌లు పోషించాల్సి ఉంది. స‌మ్మోహ‌నం సినిమా చూడ‌గానే అదితి రావు హైద‌రీకి ఫోన్ చేసి చెప్పా… అద్భుతంగా ఉంది సినిమా అని. అదితి పోషించిన‌టువంటి పాత్ర‌, మ‌హాన‌టిలో కీర్తి సురేష్ పోషించిన పాత్ర.. రంగ‌స్థ‌లంలో స‌మంత పోషించిన పాత్ర‌. ఇవ‌న్నీ చూస్తుంటే… హీరోయిన్ల పాత్ర‌ల‌కు కాస్త ప్రాధాన్య‌త పెరిగింద‌నిపిస్తోంది. ఇది మంచి టైం అని అనుకుంటున్నాను.

ప్రః రంగ‌స్థ‌లం అవ‌కాశం చేజారింద‌ని బాధ ఉందా?
జః అయ్యో..! అస్స‌లు లేదు. ఎవ‌రికి రావ‌లిసిన పాత్ర‌లు వారికొస్తాయి. రంగ‌స్థ‌లం సినిమా చూడ‌గానే సుకుమార్ గారికి కాల్ చేశాను. రామ‌ల‌క్ష్మిగా నా క‌న్నా స‌మంతా నే అందంగా ఉంది అని చెప్పాను. డేట్స్ స‌మ‌స్య‌తో కొన్ని కొన్ని సినిమాలు మిస్ అవుతున్నాయి. అయితే, ఎవ‌రికి రాసి పెట్టి ఉన్న పాత్ర‌లు వారికొస్తాయి.

ప్రః క‌న్న‌డ ప్ర‌వేశం ఎలా ఉంది?
జః అడుగు పెట్టిన చోట‌ల్లా ముందు భాష స‌మ‌స్య‌నే(న‌వ్వు). క‌న్న‌డ నేర్చ‌కుంటున్నానిప్పుడు. తెలుగు భాష బాగా కంఫ‌ర్ట్ అయిపోయింది. క‌న్న‌డలో ప్ర‌వేశం త‌రువాత ఆ భాష కూడా బాగా నేర్చేసుకుంటా. ఇలా ఇండ‌స్ట్రీ మారుతున్నంత‌సేపు కొత్త ప్ర‌దేశాలు, కొత్త మ‌నుషులతోపాటు, కొత్త భాష‌లు నేర్చుకోవ‌డం ఎంత బాగుంటుందో.

ప్రః బాలీవుడ్ ప్ర‌వేశం గురించిన ఆలోచ‌న ఉందా?
జః లేదండి. ఇక్క‌డే డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోతున్నాను. అయినా బాలీవుడ్ వాళ్ళ‌కు నేనంటూ ఒక‌దాన్ని ఉన్నాన‌ని తెలియాలి. వాళ్ళు న‌న్ను అడ‌గాలి. అప్పుడు నేను చూడాలి. ఇప్ప‌టికైతే దాని గురించిన ఆలోచ‌న‌లైతే లేవు.

ప్రః ఇంకా ఏయే సినిమాలు చేస్తున్నారు?
జః న‌క్కిన త్రినాథ రావు ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో గురూ ప్రేమ కోస‌మే చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎవ‌డో ఒక‌డు, క‌న్న‌డ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ వ‌డియార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌ట సార్వ‌భౌమ చిత్రాలు ప్రీ పొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉన్నాయి. మ‌ల‌యాళంలో చాలా అవ‌కాశాలు వ‌చ్చినా అప్ప‌టికే తెలుగులోనో, త‌మిళ్ లోనో ఒప్పుకుని ఉన్న సినిమాలు ఉండ‌డంతో, మాతృభాష అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికి ప్రేమ‌మ్ సినిమా ఒక్క‌టే అయింది. భ‌విష్య‌త్తులో అన్ని భాష‌ల‌కు స‌మ‌ప్రాధాన్య‌త‌నిస్తాను.

Continue Reading

south బజ్

చాలా క‌ల‌లున్నాయి- దిశ‌

Published

on

By

By: Nasreen Khan

ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌నేది సామెత‌. ఈ సామెత శాండ‌ల్ వుడ్ వ‌ర్థ‌మాన తార దిశా పూవ‌య్య విష‌యంలో నిరూపిత‌మైంది. ఇప్ప‌టికే క‌న్న‌డ సినిమాల్లో తానేంటో నిరూపించుకుని టాలీవుడ్ లోకి ఒక‌టే లైఫ్ అంటూ అడుగుపెట్టిందీ బ్యూటీ. తొలుత తల్లిదండ్రుల‌కు ఇష్ట‌మ‌ని సినీ రంగంలోకి అడుగుపెట్టినా ప‌ది సినిమాల‌కు చేరేస‌రికి త‌న గ‌మ్యం న‌ట‌నే అని తేలిపోయిందంటూ, త‌నకున్న క‌ల‌ల‌న్నింటినీ న‌ట‌న నుంచే సాకారం చేసుకోవాల‌నుకుంటున్నాన‌ని…. ఇలా ఎన్నో విష‌యాల‌ను తెలుగు సినీబ‌జ్ తో పంచుకుంది. ఆ విశేషాల‌ను ఆమె మాట‌ల్లోనే…

అన్ని పాత్ర‌ల్లో నిరూపించుకోవాలి
ఇప్ప‌టిదాకా నాకు వ‌చ్చిన సినిమాల్లో ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌లే వ‌చ్చాయి. కానీ, సాలిగ్రామ‌, పోలీస్ స్టోరీ లాంటి చిత్రాలు నాకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. నాకు చారిత్రాత్మ‌క సినిమాలు, విల‌నీ షేడ్ ఉన్న పాత్ర‌లు వ‌స్తే చేయాల‌నుంది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి చాలామంది హీరోయిన్లు తెలుగు సినిమాలు చేశారు. వీరిలో సౌంద‌ర్య నా ఆరాధ‌కురాలు. ఇసుమంతైనా ఎక్స్ పోజింగ్ చేయ‌కుండా, చీర‌క‌ట్టు ద్వారానే ఎంత అందంగా క‌నిపించ‌వ‌చ్చో నిరూపించిన న‌టి ఆమె. ఆమెకు తెలుగు ప‌రిశ్ర‌మే మాతృ ప‌రిశ్ర‌మ అనేంత‌గా గుర్తింపు తెచ్చ‌కుంది. ఆమె తెలుగులో ఎంద‌రినో అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె న‌ట‌నే ఆమె చ‌నిపోయినప్ప‌టికీ తెలుగు అభిమానులు ఆమెను మ‌రిచిపోలేక‌పోతున్నారు. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో ల‌క్ష్మీ అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమెలా వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి మెప్పించాల‌నేది నా కోరిక‌.

మ‌హేశ్ తో చిన్న రోల్ అయినా స‌రే…
ఇప్పుడున్న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు హీరోల‌తో న‌టించాల‌నుంది. నాకు మ‌హేశ్ బాబు అంటే చాలా చాలా ఇష్టం. ఆయ‌న సినిమాలో చిన్న పాత్ర వ‌చ్చినా స‌రే ఎగిరి గంతేస్తాను. నా పాత్ర గురించి కూడా ఆలోచించ‌ను. క‌చ్చితంగా ఆ సీన్ పండించాల‌నే ఆలోచిస్తాను. నాకు స‌మంతా అంటే భ‌లే ఇష్టం. కొన్ని కొన్ని యాంగిల్స్ లో నేను సమంతా పోలిక‌ల‌తో క‌నిపిస్తాను అని చెప్తుంటారు. అలా పోల్చ‌డం కూడా నాకు చాలా ఇష్టంగా ఉంటుంది.

వుమెన్ ఓరియంటెడ్ మూవీస్ లో చేయాల‌నుంది
సినిమాల్లో ఎన్ని పాత్ర‌లొచ్చినా మ‌న‌సు పెట్టి చేస్తూంటాను. అయితే నాకు ప్ర‌త్యేకించి వుమెన్ ఓరియంటెడ్ మూవీస్ లో న‌న్ను నేను నిరూపించుకోవాల‌ని కోరిక‌గా ఉంది. చూద్దాం… ఎవ‌రైనా ద‌ర్శ‌కుడు అటువంటి పాత్ర ఇస్తే క‌చ్చితంగా చేస్తాను. అయితే ప్ర‌తి ఇండ‌స్ట్రీలోనూ పోటీ విప‌రీతంగా ఉంది. మంచి నటీమ‌ణులు కూడా ఉన్నారు. నేను కూడా నా కెరీర్ కు సంబంధించి ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నాను.

అమ్మానాన్న‌ల‌కు ఇండ‌స్ట్రీ అంటే ఇష్టం
నాన్న పేరు పూవ‌య్య‌. జె.డి.ఎస్. పార్టీలో ప‌ని చేస్తారు. అమ్మ సుశీల‌. ఫ్యాష‌న్ డిజైన‌ర్. నాన్న‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్నేహితులు చాలామంది ఉన్నారు. నేను ఇంట‌ర్మీడియ‌ట్ లో ఉండ‌గా అనుకోకుండా ఒక షూటింగ్ కు వెళ్ళాల్సి వ‌చ్చింది. అక్క‌డ సినిమాలో అతిథి పాత్ర‌కు ప‌దిహేను, ప‌ద‌హారు సంవ‌త్స‌రాలున్న అమ్మాయి అవ‌స‌ర‌మైంది. వారు నాన్న‌ను అడిగారు. అప్ప‌టిదాకా నాకు చ‌దువు త‌ప్ప మ‌రే ప్ర‌పంచ‌మూ తెలియ‌దు. నాన్న‌కు ఇండ‌స్ట్రీ అంటే చాలా ఇష్టం. దానితో న‌న్ను ఆ పాత్ర చేయ‌మ‌ని చెప్పారు. పెద్ద‌గా అవ‌గాహ‌న లేకుండానే ఆ చిన్న పాత్ర‌లో న‌టించేశాను. ఆ త‌రువాత అమ్మకు కూడా ఇండ‌స్ట్రీ అంటే ఇష్టం ఉండ‌టంతో న‌న్ను ఇద్ద‌రూ మ‌రింత ప్రోత్స‌హించారు. దాంతో ఒక‌వైపు ఇంజ‌నీరింగ్ చ‌దువుతూనే మ‌రోవైపు న‌ట‌న‌ను కొన‌సాగించాను. నాకు సంబంధించిన డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డం అంతా అమ్మ చూసుకుంటూ నాకు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూస్తోంది.

త‌మిళ్, మ‌ల‌యాళంలో కూడా చేస్తున్నా
ప్ర‌స్తుతం తెలుగులో ఒక‌టే లైఫ్ తో అడుగు పెట్టా. మ‌రో సినిమాకోసం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఒక‌రు సంప్ర‌దించారు. క‌థ విని ఫైన‌ల్ చేయాల్సి ఉంది. త‌మిళ్ లో ఇప్ప‌టికే ఒక సినిమాను ఒప్పుకున్నాను. మ‌ల‌యాళంలో కూడా సినిమాలు చేసి ద‌క్షిణాది హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఉంది. క‌థా ప‌రంగా నా క్యారెక్ట‌ర్ న‌చ్చితేనే సినిమా చేస్తాను. ముందుగా ద‌ర్శ‌కుడు న‌న్ను సంప్ర‌దించిన‌ప్పుడు క‌థ వింటాను. క‌థ‌లో నా పాత్ర ఏమిటో తెలుసుకుంటాను. ఏ ప‌రిధుల మేర‌కు హావ భావాలు పండించాలో ద‌ర్శ‌కుడిని అడిగి తెలుసుకుంటాను. ఇవి నా పాత్ర‌లు స‌క్సెస్ అవ‌డానికి తోడ‌వుతున్నాయి. మ‌రోవైపు అమ్మ కూడా నా న‌ట‌న మెరుగు ప‌డేందుకు కొన్ని కొన్ని టిప్స్ చెప్తూనే ఉంటుంది. నా త‌మ్ముడు పి.యు.సి. చేస్తున్నాడు. వాడు నాకు పెద్ద విమ‌ర్శ‌కుడు. ఆ సినిమాలో ఏంటి అలా చేశావ్… ఇంకాస్త బాగా చేయాల్సింది అని చెప్తుంటాడు. నేను హీరోయిన్ అయినందుకు నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. పూర్తి కుటుంబం నాకు వెన్నుద‌న్నుగా నిలిచి, ప్రోత్సాహ‌మందిస్తోంది. అందుకే నేను హాయిగా సినిమాల్లో రాణించ‌గ‌లుగుతున్నాను. అందుకే తెలుగులోకి అడుగు పెట్ట‌గ‌లిగాను.

ఇండ‌స్ట్రీలో చెడు లేదు
ఏ రంగంలోనైనా మంచీ చెడు అనేవి ఉంటూనే ఉంటాయి. అయితే మ‌నం ఎంచుకునే మార్గం మ‌నం ఏం కావాలనేది నిర్ణ‌యిస్తుంద‌నేది నా న‌మ్మ‌కం. నేను ఒక ప్రొటెక్టెడ్ ఫ్యామిలీలో పెరిగాను. మా కుటుంబం కేవ‌లం అమ్మా నాన్న‌, త‌మ్ముడు మాత్ర‌మే కాదు. అమ్మ‌మ్మ, నాన‌మ్మ‌, బాబాయిలు, పిన్నిలు… ఇలా ఎంద‌రో ఉన్నారు. నాకు ఒక్క‌దాన్నే బ‌య‌ట‌కు వెళ్ళాల్సిన అవ‌స‌రం ఇంత వ‌ర‌కు రాలేదు. షూటింగ్స్ కూడా అమ్మ నాతో వ‌స్తుంటారు. రాజ‌కీయాల్లో ఏ కాస్త ఖాళీ దొరికినా నాన్న, అప్పుడ‌ప్పుడు త‌మ్ముడు… ఇలా ఎవ‌రో ఒక‌రు నాకు తోడుంటారు. తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి విన్నాను. లేటెస్ట్ గా అమెరికా ఉదంతం కూడా బ‌య‌ట‌ప‌డింది. నేను ప‌బ్ క‌ల్చ‌ర్ కు చాలా దూరం. అటువంటి పార్టీలంటేనే నాకు న‌చ్చ‌దు. ఇక స్నేహితుల మ‌ధ్య జ‌రిగే పార్టీల‌నైతే ఎక్కువ‌గా బంధువుల హోట‌ల్ లోనో, మా ఇంట్లోనో, వాళ్ళ ఇళ్ళ‌ల్లోనో… ఇలా అరేంజ్ చేసుకుంటుంటాం. నేనెప్పుడూ జ‌నాల మ‌ధ్య‌నే ఉంటూంటాను. పైగా నాకు అంద‌రూ తోడున్నారు. సో… నాకేమీ భ‌యం అనిపించ‌లేదు.

పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, ప్ర‌యాణాలు చేయ‌డం ఇష్టం: ద‌క్షిణాది చిత్రాలు చేయాల‌నుకోడానికి మ‌రో కార‌ణం కూడా ఉందండి. నాకు ప్ర‌యాణాలంటే భ‌లే ఇష్టం. నేను స్పోర్ట్స్ కూడా బాగా ఆడ‌తాను. వింబుల్డ‌న్ రాష్ట్ర స్థాయిలో ఆడాను. అథ్లెట్స్ అన్నింటిలో ఉన్నాను. కారు డ్రైవింగ్ చేయ‌డం అంటే కూడా ఇష్టం. ఈ మధ్యే నేను రాష్ట్రస్థాయిలో క్రికెట్ ఆడి ఆరు వికెట్లు తీసాను కూడా(న‌వ్వుతూ). రొమాంటిక్ క‌థ‌లు చ‌ద‌వ‌డ‌మంటే చాలా ఇష్టం. సుదీప్ నాగ‌ర్క‌ర్ రాసిన అవ‌ర్ స్టోరీ నీడ్స్ నో ఫిల్ట‌ర్, రాజీవ్ సెల్వ‌రాజ్ రాసిన లీడ్ ఆర్ బ్లీడ్ క‌థ‌లు నాకు చాలా ఇష్ట‌. వుమెన్ మోటివేటెడ్ క‌థ‌లంటే నాకు చాలా ఇష్టం. గౌరీ లంకేష్ క‌థ‌నాల‌ను కూడా బాగా చ‌దివేదాన్ని. ఖాళీగా ఉన్న స‌మ‌యంలో నేను వంట చేస్తుంటాను కూడా. స్పెష‌ల్లీ చిల్లీ చికెన్ నాకు ఇష్ట‌మైన ఐటం. నేను చేసే వంట‌కాల‌న్నింటినీ ఇంట్లో అంద‌రిమీదా ప్ర‌యోగిస్తుంటాను.(న‌వ్వు)

సామాజిక సేవ చేస్తూనే ఉంటా
స‌మ‌కాలీన స‌మ‌స్య‌ల‌పై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. మా నాన్న రాజ‌కీయ నాయకుడు. పైగా మా సొంత గ్రామం బెంగ‌ళూరుకు 365 కిలో మీట‌ర్ల దూరంలో ఉంది. మ‌డికేరిలో ముక్కోడ్లు మా గ్రామం. ఆ గ్రామంలో ఇక్క‌డ ఒక ఇల్లుంటే మ‌రో కిలో మీట‌ర్ కో, రెండు కిలో మీట‌ర్ల కో ఇంకో ఇల్లు ఉంటుంది. బాగా వెన‌క‌బ‌డి ఉంది. నాన్న‌కు ఎన్నో విన్న‌పాలు వ‌స్తుంటాయి. అక్క‌డ మంచి నీటి వ‌స‌తి కానీ, రోడ్లు కానీ, విద్యుత్ వ్య‌వ‌స్థ కానీ, స్కూల్ కానీ, క‌నీసం ఒక చిన్న టాయ్ లెట్ సౌక‌ర్యం కూడా లేని ప‌రిస్థితి ఉంది. నాన్న సోలార్ లైట్లు వేయించ‌డం, రోడ్లు బాగు చేయించ‌డం, మంచినీటిని అందేలా చేయ‌డం లాంటి వ‌న్నీ చేశారు. అవ‌న్నీ నేను చూస్తూనే ఉన్నాను. నాకు నా స్నేహితులు మీ నాన్న‌తో చెప్పి మా ఊళ్లో ఫ‌లానా స‌మ‌స్య తీర్చ‌మ‌ని చెప్పు అని చెప్తుంటారు. అలా నేను కూడా సామాజిక సేవలో భాగ‌మై పోయాను. భ‌విష్య‌త్తులో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి ప‌రిష్క‌రించ‌డానికి.

ఒకటే లైఫ్ సినిమా చూడండి
యువ‌త వ్య‌స‌నాల‌కు బానిస అయిపోతే కుటుంబంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంద‌నే క‌థాక‌థ‌నంతో సినిమా తీశారు. క‌థంతా నా చుట్టూనే తిరుగుతుంటుంది. ఇంకా చాలా అంశాలు క‌థ‌లో ఉన్నాయి. ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్ స‌ర్ నాకు భాష రాక‌పోయినా చాలా బాగా అర్థం చేయించి న‌టింప చేశారు. ఇక హీరోలుగా ఉన్న మ‌హేష్ చౌద‌రి, రిషి పుత్తూరు న‌న్ను చాలా బాగా ఎంక‌రేజ్ చేశారు. క‌చ్చితంగా నా పాత్ర అంద‌రికీ న‌చ్చుతుంది.

Continue Reading

Trending