Connect with us

పత్రికా సమావేశం

నేను, నిహారిక న‌ట‌న‌కే ప్రాధాన్య‌త‌నిచ్చాం, నిడివికి కాదు – సుమంత్ అశ్విన్

Published

on

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా బ్యానర్స్ పై తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ఈచిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంధర్భంగా చిత్ర హీరో సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు …

మా పేరెంట్స్ కి నచ్చిన అమ్మాయితోనే నా పెళ్ళి
ఒక అమ్మాయిని నిజాయితీ గా ప్రేమిస్తే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పటివరకు ఏ అమ్మాయితో ప్రేమలో పడలేదు. ఫ్రెండ్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. అందరూ ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోవలసిందే. నాకు కూడా టైం వచ్చినపుడు జరుగుతుంది. కానీ సమయం పడుతుంది. పేరెంట్స్ ఎటువంటి పెళ్లి చేసుకోమంటున్నారు అనేదానికంటే వాళ్లకి నేను ఎలా చేసుకున్నా ఓకే. కాకపోతే ఆ అమ్మాయి మా పేరెంట్స్ కి కూడా నచ్చాలి కదండీ. వాళ్ళకి నచ్చితే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ వాళ్ళు నా ఇష్టాన్ని కాదనరు అని నా ఫీలింగ్. ఇక నా నెక్స్ట్ సినిమా ప్రేమకథా చిత్రం 2 చేస్తున్నాను, దాంతో పాటు మరో రెండు మూడు అఫర్స్ ఉన్నాయి. నాన్నతో కూడా ఓ సినిమా చేయాలని ఉంది.

నా అన్ని సినిమాల్లోకన్నా ఈ సినిమాకే పాజిటివ్ వైబ్రేషన్స్
నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ఈ సినిమాకి ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్స్ కనపడుతున్నాయి. తప్పకుండా ఫ్యూచర్ లో పెద్ద బ్యానెర్లలో నటించేందుకు ఒక ప్లాట్ ఫామ్ గా నిలబడుతుంది అనుకుంటున్నా. సినిమాలో ముఖ్యంగా లాస్ట్ అర్ధగంట అందరికి నచ్చుతుంది. చాలా నమ్మకం ఉంది .. అందుకే అంతగట్టిగా చెపుతున్నాను. హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఒకరకంగా లవ్ స్టోరీ నే కానీ, ఇదివరకు వచ్చినట్లుగా జనరల్ లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ సందర్భంగా వచ్చే లవ్ స్టోరీ అని కూడా చెప్పలేం. ఒకరకంగా రొమాన్స్ డ్రామా విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే అసలు పెళ్లి బ్యాక్ డ్రాప్ అంటూ ఏమి ఉండదు. కాకపోతే ఒక పెళ్లి వాతావరణంలో ఒక కథ జరుగుతుంది. ఆ కథలో ఎవరి పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, పేరెంట్స్, అమ్మాయి, అబ్బాయి ఇలా వారి ఫీలింగ్ ఏంటి అనే దానిపైనే మూవీ ఉంటుంది. అది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇందులో నేను అడ్వర్టైజింగ్ కంపెనీలో యాడ్స్ కి జింగిల్స్ రాస్తుంటా, నా పాత్రా పేరు ఆనంద్. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే ఇటువంటి ఫ్యామిలీ బేస్డ్ మూవీలో విలన్ ఉన్నప్పటికీ ఆ పరిధి మేరకు ఉంటుంది. అయితే మా సినిమాలో విలన్ ఉన్నారా లేదా, ఎవరు విలన్ అనేది ముందే చెప్పలేను.ఎక్కువ, తక్కువ అనేది నేను ఆలోచించలేదండి. క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని మాత్రమే ఆలోచించాను. నా క్యారెక్టర్, నిహారిక క్యారెక్టర్ ఇద్దరివీ కూడా సినిమాలో చాలా బాగుంటాయి. ఎవరిది ఎక్కువ సేపు ఉండే రోల్ అనేది మేము లెక్కవేసుకోలేదు. పెర్ఫార్మన్స్ ను బట్టి ఎవరికి వాళ్ళం ఇంకా బాగా నటిస్తే బాగుంటుంది అని అనుకున్నాం అంతే.

 

సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా ఉంటుంది
ఈ సినిమా వల్ల పెళ్లి గురించి తెలుసుకున్నాను. ఇటీవల జరిగిన మా కజిన్ పెళ్ళిలో పేరెంట్స్, అన్న దమ్ములు అక్కాచెల్లెళ్లు, ముఖ్యంగా కుటుంభాల మధ్య అనుబంధం గురించి చాలా తెలుసుకున్నాను. ఈ కథ ఓకే చెప్పడానికి కారణం. డైరెక్టర్ లక్ష్మణ్ నా దగ్గరకు వచ్చి, కథ చెప్పినపుడు లాస్ట్ అరగంటలో దాదాపు ఒక ఇరవై నిముషాలు వచ్చే డైలాగ్స్ మరియు ఆ సన్నివేశాలు చాలా నచ్చాయి నాకు. అలానే సినిమా కూడా ఎక్కడ బోర్ అనేది కొట్టకుండా వినోదాత్మకంగా సాగుతూ వెళ్తుంది. ఈ క్యారెక్టర్ కి నిహారిక అయితే బాగుంటుందని దర్శకుడు అనుకున్నారు. తను ఆ క్యారెక్టర్ కి పూర్తిగా న్యాయం చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో ఆమె నటన అద్భుతం. ఆ సీన్ లో ఆమె సరిగా చేయకపోతే సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ ఉండదు. కానీ ఆ అమ్మాయి నటించిన తీరు సెకండ్ హాఫ్ మీద మంచి ఆసక్తిని తీసుకొస్తుంది. ఇక యువి బ్యానర్ వారు కూడా ఇప్పుడు తీస్తున్న ‘సాహో’ పెద్ద సినిమా స్థాయిలో ఎలా ఖర్చు పెడుతున్నారో, దీనికి కూడా ఎక్కడా కంప్రమైజ్ కాకుండా ఖర్చు పెడుతున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ చేయడానికి వాళ్ళే ప్రధాన కారణం. వాళ్ళు లేకపోతే సినిమా ఇంత గ్రాండియర్ గా ఉండేది కాదేమో.

తాజా వార్తలు

`ఐశ్వ‌ర్యాభిమ‌స్తు` మ్యూజిక్ లాంచ్‌

Published

on

By

శ్రీమ‌తి వ‌రం మాధ‌వి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆర్య‌, విశాల్, సంతానం, త‌మ‌న్నా, భాను న‌టించిన చిత్రం `ఐశ్వ‌ర్యాభిమ‌స్తు`. ఎం.రాజేష్ ద‌ర్శ‌కుడు. వ‌రం జ‌య‌త్ కుమార్ నిర్మాత‌. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల సీడీని కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా బుధ‌వారం హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు.
ర‌మేశ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “మా నాన్న పెద్ద భూస్వామి అయినా.. నాన్న సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్ప‌కుండా సినిమాల్లో రాణించాల‌ని ముంబై వెళ్లిపోయారు. నెమ్మ‌దిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. ద‌ర్శ‌కుడిగా ఎదిగారు. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల‌పై మంచి ప‌ట్టు సాధించారు. ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్స్ సిల్వ‌ర్ జుబ్లీలు చాలా తీసింది. స‌కుటుంబంగా చూడ‌ద‌గ్గ కుటుంబ విలువ‌లున్న సినిమాల‌ను చాలా చేశాం. ఏక్ తుఝే కేలియే కూడా చేశాం. ఇవ‌న్నీ చాలా వండ‌ర్స్ సృష్టించాయి. మా నాన్న సినిమాల‌పై త‌ప్ప‌, ఇంక‌దేనిపై ఇన్వెస్ట్ చేయ‌డానికి ముందుకొచ్చేవారు కాదు. అందుకే మాకు చెన్నై, ముంబై, బెంగుళూరు, హైద‌రాబాద్‌లో కార్యాల‌యాలున్నాయి. అంద‌రిళ్ల‌ల్లో  మా ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్స్ గురించి తెలుసు. నంద‌గోపాల్ అని మా ద‌గ్గ‌ర ఆడిట‌ర్ ఉన్నారు. ప్ర‌జ‌లు సినిమా చూడ‌టం వ‌ల్ల‌నే నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నాను అని అనుకుని రూ.కోటి పెట్టి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసి, ఐదెక‌రాల స్థ‌లాన్ని కేటాయించాం. నాగేశ్వ‌ర‌రావుగారు ఓ డాక్ట‌ర్‌. ఆయ‌న కూడా మా నాన్న‌లాగానే సేవాత‌త్ప‌ర‌త ఉన్న వ్య‌క్తి. మ‌న ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికే ఆయ‌న మ‌న దేశానికి వ‌చ్చాడు. మా ఐ ఇన్‌స్టిట్యూట్ ని అంత‌ర్జాతీయ గుర్తింపు ఉంది. భ‌విష్య‌త్తు త‌రాల వారికీ ఉప‌యోగ‌ప‌డే ప్రాజెక్ట్ అది. 50 శాతం మందికి మేం అక్క‌డ ఉచితంగా సేవ‌లు అందిస్తున్నాం“ అని అన్నారు.
నిర్మాత వ‌రం జ‌య‌త్ కుమార్ మాట్లాడుతూ – “ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేస్తున్నాం. త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాం. స‌పోర్ట్ అందిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌“ అన్నారు.
కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా మాట్లాడుతూ – “నిర్మాత జ‌యంత్‌కు ఈ సినిమా పెద్ద విజ‌యాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్య‌తో నాకు మంచి అనుబంధం ఉంది. త‌న‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. త‌మిళంలో సూప‌ర్‌హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ – “మంచి హిలేరియ‌స్ ఎంటర్‌టైన‌ర్‌. జ‌యంత్ తెలుగులో చేస్తున్న ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెస్ కావాలి. పాజిటివ్ ప‌ర్స‌న్ జ‌యంత్ పెద్ద స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
By:    Nasreen Khan

Continue Reading

తాజా వార్తలు

సోషియో ఫాంటసీ హారర్

Published

on

By

ఎంటర్ టైనర్ ‘గండ భేరుండ’ పాటల విడుదల!!

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ ‘గండభేరుండ’. చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా.. రాధిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పాటలు ట్రెండ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అక్టోబర్ 5 న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. హీరోయిన్ రాధిక, దర్శకుడు సూరియన్, నిర్మాత చల్లమళ్ల రామకృష్ణ, హీరోల్లో ఒకరైన పవన్ కుమార్, విలన్ పాత్రధారి రవికిరణ్ శొంఠి, లేడీ డైరెక్టర్ సుచరిత, ఆనంతలక్ష్మి, డి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాటలతోపాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన అనంతరం ‘గందభేరుండ’ ఘన విజయం సాధించాలని లయన్ సాయి వెంకట్, జె.వి.మోహన్ గౌడ్ ఆకాంక్షించారు. హీరోయిన్ గా పరిచయమవుతున్న రాధికకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు.
 
 దర్శకుడు సూర్యన్ మాట్లాడుతూ.. ‘గండ భేరుండ పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్ని అత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే ఇతివృత్తంతో రూపొందిన సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ ‘గండభేరుండ’. మలేషియాలో చేయించిన 17 నిమిషాల నిడివి కల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మా నిర్మాతలు కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ ‘గండభేరుండ’ చిత్రాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం. సినిమా అద్భుతంగా వచ్చింది” అన్నారు. 
 
నిర్మాత చల్లమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. “సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. 
రవికిరణ్, సమ్మెట గాంధీ, విశ్వేశ్వరావు, జయవాణి, రాధ, శ్రీరంభ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి  కెమెరా: ఆనంద్, సంగీతం: శ్రీసాయిదేవ్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాతలు: కె.సూరిబాబు-చల్లమళ్ళ రామకృష్ణ, రచన-దర్శకత్వం: కె.సూరిబాబు!!
By:    Nasreen Khan

Continue Reading

తాజా వార్తలు

‘ నాటకం ‘ మూవీ సక్సెస్ మీట్..!!

Published

on

By

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా  విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం  ‘నాటకం’.. కళ్యాణ్ జి గోగన దర్శకుడు.  సాయి కార్తీక్ సంగీతం అందించగా గరుడవేగతో మంచి పేరు తెచ్చుకున్న అంజి సినిమాటోగ్రఫీ ని అందించారు..   కాగా ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా రిలీజ్ అయ్యింది.  ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ను ఈ రోజు ఎంతో అంగరంగవైభవంగా జరిపారు.. ఈ కార్యక్రమానికి సినిమా టీం అందరు రాగ, సినిమా  హిట్ పై తమ ఆనందాన్ని వెల్లడించారు..
ఈ సందర్భంగా నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ..  నమ్మి సినిమా ని కొన్నందుకు అది మీరు ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాల థాంక్స్.. మా బ్యానర్ లో ఫస్ట్ ఫిలిం ఇంత పెద్ద హిట్ అవడం చాల హ్యాపీ గా ఉంది.. ఈ ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తానని చెప్తున్నాను.. అందరు కష్టపడి చేసిన సినిమా ఇది.. చిన్న సినిమా, అదీ అందరు కొత్త ఆర్టిస్టులతో వచ్చిన సినిమా ఇలాంటి సినిమా హిట్ చేసినందుకు చాల చాల థాంక్స్ అన్నారు..
హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ..   అందరు ఫోన్ చేసి సినిమా చాల బాగుందని అంటున్నారు.  ఇక్కడే కాదు యూకే నుంచి కూడా మంచి టాక్ వస్తుంది. సినిమా నిన్న రిలీజ్ కాగానే మంచి రెస్పాన్స్ వచ్చింది.. చాల హ్యాపీ గా ఉంది. వేరే ప్లేసెస్ లో సినిమా రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికి ధన్యవాదాలు అన్నారు..
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ..
చిన్న సినిమాలను మళ్ళీ మళ్ళీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ కూడా చాల బాగా వచ్చాయి.. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి చాల థాంక్స్..ఈ సినిమా కి మెయిన్ మౌత్ టాకే పబ్లిసిటీ.. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఈ సినిమా కి పనిచేసిన అందరికోసం ఈ సినిమా  సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
By:    Nasreen Khan

Continue Reading

Trending