Connect with us

Uncategorized

గీతా మాధురి రెమ్యున‌రేష‌న్ రోజుకి ఎంతో తెలుసా?

Published

on

టాలీవుడ్ సింగ‌ర్స్ లో లీడ్ సింగ‌ర్ గా పేరున్న గీతా మాధురి బిగ్ బాస్ 2 రియాలిటీ షోలో పాల్గొంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆమెతో పాటు మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు కూడా ఈ షోలో పాల్గొంటున్నారు క‌దా. అయితే వారంద‌రిక‌న్నా కూడా గీతా మాధురికి అత్య‌ధిక పారితోషికం అంద‌జేస్తున్నార‌ట‌. Image result for geetha madhuri
అందిన స‌మాచారం ప్ర‌కారంః వివిధ ప్రాంతాల‌లో, బాలీవుడ్ లో జ‌రుగుతున్న బిగ్ బాస్ లో పాల్గొంటున్న స‌భ్యులంద‌రికీ కూడా రోజువారీగానే వారి రెమ్యున‌రేష‌న్ చెల్లిస్తుంటారు. బాలీవుడ్ లో అయితే ఒక్కో సెల‌బ్రిటీకి అత్య‌ధికం అయితే అయిదు ల‌క్ష‌ల దాకా చెల్లిస్తుంటారు. ఇక్క‌డ స‌భ్యుల‌కు రోజుకు రూ.25వేల నుంచి స‌భ్యుల‌కు చెల్లిస్తున్నారు. గీతా మాధురి విష‌యానికొచ్చేస‌రికి సీన్ రివ‌ర్స్ అయింది. ఆమెకు ఆ ఇంటిలోని స‌భ్యులంద‌రిక‌న్నా ఎక్కువ పారితోషికం రూ.20 ల‌క్ష‌లు చెల్లిస్తున్నార‌ట‌. Related image
ఇక గీతా మాధురి ఎన్ని రోజులు బిగ్ బాస్ షోలో కొన‌సాగితే అన్ని రూ.20 ల‌క్ష‌లు అన్న‌మాట‌. ఒక వేళ ఆమె మ‌ధ్య‌లోనే ఎలిమినేట్ అయితే చెప్ప‌లేం కానీ అనుకున్న ప్ర‌కారం నూటా ఆరు రోజులు గ‌నుగ ఆమె కొన‌సాగితే మాత్రం భారీ అమౌంట్ ఆమె ఇంటికి చేరుతుంద‌న్న‌మాట‌.Related image

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

సాక్ష్యం డిజాస్ట‌ర్ తో పి.ఆర్. టీమ్ పై మండి ప‌డిన‌ పూజా హెగ్డే

Published

on

By

కెరీర్ ను జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న హీరోయిన్ల‌లో పూజా హెగ్డే ఒక‌రు. దువ్వాడ జగన్నాథంలో హాట్ హాట్గా న‌టించ‌డంతో గ్లామర్ క్వీన్ పూజా హెగ్డేను టాలీవుడ్లో భారీ ఆఫర్లు చుట్టుముట్టాయి. దాంతో కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నారు. కానీ ఇటీవల నటించిన చిత్రం సాక్ష్యం నిరాశజనకంగా మారడంతో ఆమె తన మేనేజర్, పీఆర్ బృందంపై విరుచుకు ప‌డింద‌ట.
పూజా హెగ్డే 2014లోనే ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ రావడానికి రెండేళ్లు పట్టింది. అల్లు అర్జున్తో నటించిన దువ్వాడ జగన్నాథంతో టాలీవుడ్లో స్థిరమైన కెరీర్ ఏర్పడింది. దాంతో మెల్లగా మంచి చిత్రాల ఎంపికపై దృష్టిసారించింది. అలాంటి సమయంలోనే సాక్ష్యం సినిమా ఆఫర్ ముందుకు వచ్చిందట. సాక్ష్యంలో సౌందర్య లహరి పాత్ర ఆఫర్ను తన టీమ్ ముందుకు తీసుకు వ‌చ్చిన‌ప్పుడు తొలుత నిరాకరించారట. అయితే చాలా మంచి కథ, అందులో పాత్ర కూడా బాగుంటుంది అని తన పీఆర్ టీమ్ నచ్చచెప్పి ఆఫర్ను ఒప్పుకునేలా చేశారట. బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన నటించడానికి పూజా హెగ్డేకు భారీ రెమ్యునరేషన్ ముట్ట‌జెప్పార‌నే వార్త ప్రచారమైన సంగతి తెలిసిందే.
సాక్ష్యం డిజాస్ట‌ర్ తో…
ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే మాట వినిపిస్తున్నది. ఇలాంటి సినిమాను ఎందుకు అంటగట్టారని అంశంతో పూజా హెగ్డే తన టీమ్పై మండిపడ్డారట. తాజాగా రిలీజైన సాక్ష్యం సినిమాకు డిజాస్టర్ అనే టాక్ వినిపిస్తున్నది. సుమారు రూ.40 కోట్లతో మంచి వీఎఫ్ఎక్స్ సాంకేతికతతో ఈ చిత్రాన్ని రూపొందించారు. పూజా హెగ్డే తన టీమ్ను గట్టిగా మందలించడమే కాకుండా ఇలాంటి సినిమాలను తన ముందుకు తీసుకురావొద్దని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారట. ఏదైనా సినిమా ఆఫర్ వస్తే అది నా కెరీర్కు ప్లస్ అయ్యేలా ఉండాలని చెప్పారట. దాంతో పీఆర్ టీమ్కు దిమ్మ తిరిగినంత పనైందనేది సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

Continue Reading

Uncategorized

ధనుష్ కోసం  ప్రభుదేవా!

Published

on

By

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ‘మారి 2’ చిత్రంలో నటిస్తున్నారు. బాలాజీ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. 2015లో ధనుష్, కాజల్ జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మారి’ కి సీక్వెల్ గా తెరకెక్కితుంది ఈ చిత్రం.

ఇక ఈ చిత్రంలోని ఒక సాంగ్ కు ప్రముఖ కొరియోగ్రఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. గత కొంత కాలంగా దర్శకుడు గా బిజీ అవుతున్న ప్రభుదేవా వేరే సినిమాలకు కొరియోగ్రఫీ చేయడం తగ్గించేశారు. ఇప్పుడు తాజాగా ఆయన కంపోజ్ చేసిన డాన్స్ ను ఈ చిత్రంలో చూడబోతున్నాం. సాయి పల్లవి కథనాయికగా నటిస్తున్న ఈచిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ పతాకం ఫై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ,విద్య , రోబో శంకర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇంతకుముందు తెలుగులో మారి చిత్రాన్ని ‘మాస్’ పేరుతో విడుదలచేశారు.

 

 

Continue Reading

Uncategorized

సెట్స్ పైకి వెయ్యికోట్ల భారీ సినిమా ?

Published

on

By

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కే ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ రచయిత వాసుదేవ నాయర్ రాసిన రండా మూలమ్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. మలయాళం వెర్షన్ కి ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే మిగతా భాషలకు మాత్రం ది మహాభారత అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారు. ఐ ఆర్ శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో పూజ కార్యక్రమాలు జరిపి .. వచ్చే జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుతారట. రెండు భాగాలుగా తెరకెక్కించే ఈ సినిమా మొదటి భాగాన్ని 2020 లో విడుదల చేస్తారట. పలు భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తారని తెలిసిందే.

Continue Reading

Trending