Connect with us

చిత్ర సమీక్ష

ఒక లాయర్‌కు, హంతకుడికి మధ్య జరిగే ఆటే ‘ఆట‌గాళ్ళు’

Published

on

కమర్షియల్ హీరోగా సక్సెస్ కాలేని నారా రోహిత్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో రోటీన్‌కు భిన్నమైన కథలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు ఈ నారా వారి హీరో. జగపతి బాబు లాంటి వెర్సటైల్ యాక్టర్ కూడా ఈ సినిమాలో భాగం కావడంతో ప్రేక్షకుల్లో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ కలిసి ఆడిన ఆట ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో ఓసారి సమీక్షిద్దాం.

కథ ఏమిటంటే…
సిద్ధార్థ్ (నారా రోహిత్) టాలీవుడ్లో అపజయం ఎరుగని టాప్ ఫిల్మ్ డైరెక్టర్. అంజలి(దర్శన బానిక్) అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటాడు. అంతా సవ్యంగా సాగుతున్న వీరి కాపురంలో అనుకోని సంఘటన…. తమ ఇంట్లోనే అంజలి హత్య చేయబడుతుంది. సిద్ధార్థ్ మీద అనుమానంతో పోలీసులు అతడిని అరెస్టు చేస్తారు. సిద్ధార్థ్ లాయర్‌ను పెట్టుకోకపోవడంతో ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రముఖ క్రిమినల్ లాయర్ వీరేంద్ర(జగపతి బాబు) టేకప్ చేస్తాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా హంతకుడు సిద్దార్థ్… కాదని, గతంలో అంజలిని ప్రేమించాలని వెంటపడ్డ మున్నా ఈ దారుణానికి ఒడిగట్టాడని తేల్చేసి… అతడికి ఉరిశిక్ష పడేలా చేసి కేసు ఫినిష్ చేస్తాడు.

 

అసలు ఆట ఇప్పుడు మొదలైంది
తనను కేసులో గెలిపించిన వీరేంద్రకు సిద్ధార్థ్ ఖరీదైన కారును గిఫ్టుగా పంపిస్తాడు. తనకు ఇలాంటివి తీసుకోవడం ఇష్టం ఉండదని, న్యాయం ఎటు వైపు ఉంటే అటు తాను వైపే ఉంటానని చెప్పి ఆ బహుమతిని తిరిగి ఇచ్చేస్తాడు. తిరిగి వెళుతున్న సమయంలో వీరేంద్రకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఈ హత్య చేసింది మున్నా కాదని, సిద్ధార్థ్ ఈ కేసు నుండి బయట పడటానికి తనను పావులా వాడుకున్నాడని తెలుసుకున్న తర్వాత సినిమాలో అసలు ఆట మొదలవుతుంది.

ఆటగాళ్లు…
అసలు సిద్ధార్థ్ తన భార్యను చంపడానికి కారణం ఏమిటి? న్యాయాన్ని గెలిపించడానికి సీఎంను సైతం ఎదిరించే వీరేంద్ర… ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఉచ్చులో ఎలా పడ్డాడు? ఒక లాయర్‌కు, హంతకుడికి మధ్య జరిగిన ఆటలో చివరికి ఎవరు పైచేయి సాధించారు అనేది మిగతా కథ.

Rating : 2/5

చిత్ర సమీక్ష

లక్ష్మీ – డ్యాన్స్ ఆధారిత సినిమా

Published

on

By

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ప్రత్యేక పాత్రలో మాస్టర్ దిత్య నటించిన చిత్రం లక్ష్మి. డ్యాన్స్ కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభుదేవ సరసన ఐశ్వర్యా రాజేష్ నటించింది. అభినేత్రి, కణం చిత్రాలను రూపొందించిన ఏఎల్ విజయ్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. డ్యాన్స్‌ను పిచ్చిగా ఆరాధించే ఓ చిన్నారి తన లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నదనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 24న రిలీజైంది. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
 
లక్ష్మీ సినిమా కథ 
లక్ష్మి (దిత్య భండే)కు డ్యాన్స్ అంటే పిచ్చి. తండ్రి లేకపోవడం వల్ల తల్లి నందిని (ఐశ్వర్య రాజేష్) సంరక్షణలో పెరుగుతుంటుంది. అయితే డ్యాన్స్ అంటే చెప్పలేనంత అసహ్యం. తల్లికి ఇష్టం లేకున్నా తనలో ఉండే కోరికను అణిచి పెట్టుకోలేకపోతుంది. తల్లికి తెలియకుండా రెస్టారెంట్ యజమాని క‌‌ృష్ణ అలియాస్ వీకే (ప్రభుదేవా) సహకారంతో డ్యాన్స్ అకాడమీలో చేరుతుంది. వీకే గొప్ప డ్యాన్సర్ అనే విషయం తెలుస్తుంది. చివరికి తనకు దూరమైన ప్రేయసి కుమార్తెనే లక్ష్మీ అని వీకే తెలుసుకుంటాడు. జాతీయ స్థాయిలో జరిగే పోటీకి లక్ష్మీ ఉండే గ్రూప్‌ను వీకే సన్నద్ధం చేస్తాడు.
స్టోరిలో ట్విస్టులు
నందిని, వీకే ఎందుకు దూరమయ్యాడు. జాతీయ స్థాయి పోటీలో వీకే చాంఫియన్‌గా నిలువలేకపోయవడానికి కారణం ఏమిటి? లక్ష్మీ నేషనల్ ఛాంపియన్ అయిందా? నేషనల్ ఛాంపియన్ అవడానికి ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నది? నందిని, వీకే ఒక్కటయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్మీ సినిమా కథ.

ఫస్టాఫ్ రివ్యూ 
లక్ష్మీకి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అనే విషయాన్ని తెలుపడం, అలాగే వీకే పరిచయం లాంటి అంశాలు తొలి భాగంలో ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే స్కూల్‌లో డ్యాన్స్ చేయడం, హెడ్‌ మాస్టర్‌కు దగ్గరవ్వడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు కొంత వినోదం పంచేలా ఉంటాయి. కొన్ని రాజకీయాల వల్ల వీకే నేషనల్ ఛాంపియన్ కాలేకపోవడమనే అంశం కథలో కొంత ఆసక్తిని రేపడంతో తొలి భాగం ముగుస్తుంది.
 
సెకండాఫ్ రివ్యూ

సెకండాఫ్‌లో తల్లికి తెలియకుండా వీకేతో కలిసి ముంబైలో ప్రైడ్ ఇండియా డాన్స్ పోటీలకు వెళ్లడం ప్రధాన భాగంగా మారుతుంది. డ్యాన్స్ పోటీలలో శిక్షణ, పోటీలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. కాకపోతే గొప్పగా ఆకర్షించేలా, సన్నివేశాల్లో భావోద్వేగం లేకపోవడంతో చప్పగా సాగిపోతుంటాయి. చివరికి లక్ష్మీకి యాక్సిడెంట్ జరిగి చెవుడు సంభవించడంతో కథ మలుపు తిరుగుతుంది. చెవిటితనంలో మ్యూజిక్ వినకుండా డ్యాన్స్ పోటీలో ఎలా నెగ్గిందనే విషయంపై దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు ప్రయత్నం చేశాడు.

ఏఎల్ విజయ్

డైరెక్షన్ భావోద్వేగం పండించే కథాంశంగా సినిమాలకు రూపొందించే పేరు ఏఎల్ విజయ్‌కి ఉంది. అయితే లక్ష్మీ విషయానికి వస్తే కథలో ఎక్కడా ఎమోషనల్ కంటెంట్ ఉండదు. బుల్లితెర మీద డ్యాన్స్ ప్రొగ్రాం చూసిన ఫీలింగే తప్ప.. ఓ ఎమోషనల్ కథను చూస్తున్నామనే ఫీలింగ్ కలిగించకపోవడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పవచ్చు. ప్రభుదేవాను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం మరో మైనస్.
ప్రభుదేవా పెర్ఫార్మెన్స్ 

ప్రభుదేవా లక్ష్మీ లాంటి డ్యాన్స్ నేపథ్యం ఉన్న చిత్రాలు కొట్టిన పిండే అనడం గొప్ప విషయం కాదు. అలాంటి వ్యక్తి నుంచి డ్యాన్స్ నేపథ్యంగా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉంటాయి. కానీ ప్రభుదేవ స్థాయిని మించి ఆశించేలా సినిమా లేకపోయింది. లక్ష్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే చిత్రంలో అక్కడక్కడ ప్రభుదేవా మెరుపులు మెరిపించాడు. వీకే పాత్రలో భావోద్వేగాలు లేకపోవడం ప్రభుదేవా గొప్పగా నటించడానికి అవకాశం లేకపోయింది.

లక్ష్మీ పాత్రలో 

దిత్య ఇక దిత్య విషయానికి వస్తే లక్ష్మీ పాత్రలో ఒదిగిపోయింది. తొలిభాగంలో చాలా చలాకీగా కనిపించింది. సెకండాఫ్‌లో ఆమె సింగిల్ ఫెర్ఫార్మెన్స్ స్కోప్ తక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే మంచి ఈజ్‌తో తెర మీద ఓ మ్యాజిక్ చేసింది. ఇక గ్రూప్‌లో ఉండే మిగితా పిల్లలు చిచ్చరపిడుగుల్లా కనిపించారు.

మిగితా పాత్రల్లో 

లక్ష్మీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ సింగిల్ మదర్‌ పాత్రలో కనిపించింది. ప్రియుడికి దూరమైన భగ్న ప్రేమికురాలిగా, ఓ బిడ్డకు తల్లి లాంటి రెండు విభిన్నమైన పాత్రల్లో నటించింది. కొన్ని సన్నివేశాల్లో మెప్పించింది. సత్యం రాజేష్ పాత్రకు అంతగా స్కోప్ లేకపోయింది. ప్రభుదేవా నిర్వహించే రెస్టారెంట్‌లో సహాయకుడి పాత్రలో అప్పడప్పుడు నవ్వించాడు. సెకండాఫ్‌లో హెడ్మాస్టర్ కోవై సరళ సీన్లు పడిపడేలా ఉంటాయి. రెగ్యులర్‌గా కనిపించే సినిమాలో కోవై సరళ కామెడీ కొంత ఫ్రెష్‌గా ఉంటుంది.

టెక్నికల్ అంశాలు 

లక్ష్మీ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. రీరికార్డింగ్ బాగుంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. డ్యాన్స్ పోటీల సందర్బంగా తన పనితీరు మెరుగ్గా కనిపించింది. ఆడిటోరియం బేస్డ్‌ కథ కావడంతో అతని ప్రతిభను బయటకు పెట్టుకోవడానికి అవకాశం చిక్కలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా …

ప్రభుదేవా, డ్యాన్స్‌పై ఇష్టపడే ప్రేక్షకులకు లక్ష్మీ సినిమా నచ్చుతుంది. దిత్యా, డ్యాన్స్ యాక్టింగ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. వారాంతంలో పిల్లలలతో ఎంజాయ్ చేయడానికి కాలక్షేపంగా లక్ష్మీని చూడటానికి ఓ ఛాన్స్ తీసుకోవచ్చు.

బలం, బలహీనత 
ప్లస్ పాయింట్స్ … ప్రభుదేవా దిత్య డాన్స్ ప్రతిభ
 సెకండాఫ్ … మైనస్ పాయింట్స్ రొటీన్ కథ భావోద్వేగం పండకపోవడం ఫస్టాఫ్‌లో సాగదీత.
 
తెర వెనుక, తెర ముందు 
నటీనటులు: ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్, ఏఎల్ విజయ్, దిత్య, సత్యం రాజేశ్, సల్మాన్ యూసఫ్ ఖాన్ 
దర్శకత్వం: ఏఎల్ విజయ్ 
నిర్మాతలు: ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్ రవీంద్రన్ 
సంగీతం: సామ్ సీఎస్ 
సినిమాటోగ్రఫి: నిరవ్ షా బ్యానర్: ప్రమోద్ ఫిల్మ్స్, ట్రైడెంట్ ఆర్ట్స్ 

రిలీజ్ డేట్: 2018-08-24

Rating: 2.5/5

Continue Reading

చిత్ర సమీక్ష

జేమ్స్ బాండ్ త‌ర‌హా పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన అడ‌వి శేష్

Published

on

By

By: Nasreen Khan
ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా నేడు వరల్డ్ వైడ్‌గా గూఢ‌చారి చిత్రం విడుద‌లైంది. క్షణం సినిమాతో నటుడిగానే కాక రచయితగా కూడా సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ మరోసారి తన కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సారి హాలీవుడ్ త‌ర‌హా జేమ్స్ బాండ్ సినిమాలను తలపించే గూఢచారి కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తానే లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించాయి. శశి కిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. శుక్ర‌వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు అల‌రిస్తుంది.? రచయితగా అడివి శేష్ ఎలాంటి విజయం సాధించాడు..?
 
కథేమిటంటే…
 ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకు గోపి (అడివి శేష్‌). గోపి బాల్యంలోనే సిక్కింలో జరిగిన ఓ ఆపరేషన్‌లో తండ్రి రఘువీర్‌ చనిపోతాడు. దీనితో రఘువీర్‌ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్‌), గోపికి ప్రాణ హాని ఉందని అతడి ఐడెంటిటీ మార్చి అర్జున్‌ కుమార్‌ పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్‌ ఎన్ని ఉద్యోగాలు వచ్చినా రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో తన తండ్రిలా భాగం కావాలనుకుంటాడు. సీబీఐ, ఐబీ, రా ఇలా అన్ని బ్యూరోలకు 174 అప్లికేషన్స్‌ పెట్టుకున్నా ఏ ఒక్క‌దాని నుంచి స్పంద‌న‌ రాదు. చివ‌ర‌గా 175వ సారి తాను మాజీ ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకుని అని మెన్షన్‌ చేసి ద‌ర‌ఖాస్తు చేస్తాడు. ఈ సారి అర్జున్‌కు కాల్‌ వస్తుంది. త్రినేత్ర అనే స్పెషల్ టీం కోసం అర్జున్‌ను ఎంపిక‌ చేస్తారు. అర్జున్‌ తో పాటు మరో ఐదుగురు అదే టీంలో ట్రైన్ అవుతారు. వారిలో బెస్ట్ అనిపించుకున్న అర్జున్‌.. త్రినేత్ర 11గా అపాయింట్‌ అవుతాడు.
 
కానీ అర్జున్‌ అపాయింట్ మెంట్ అయిన రోజే త్రినేత్ర సృష్టి కర్త ఆచారి మీద ఎటాక్ జ‌రుగుతుంది. ఎటాక్‌లో ఆచారితో పాటు కొంత మంది ఆఫీసర్స్‌ కూడా చనిపోతారు. ఎటాక్ చేసిన వ్యక్తి అర్జున్‌ బైక్‌ మీద రావటం, ఆచారిని చంపిన తుపాకి మీద అర్జున్‌ వేలి ముద్రలు ఉండటంతో ప్రభుత్వం అర్జునే తీవ్రవాదులకు కోవర్ట్‌ గా మారాడని భావిస్తుంది. విషయం తెలుసుకున్న అర్జున్‌ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అసలు ఆచారి మీద ఎటాక్ చేసింది ఎవరు..? వాళ్లు అర్జున్‌ చేసినట్టుగా ఎందుకు సృష్టించారు..? అర్జున్‌ ఈ మిస్టరీని ఎలా చేదించాడు..? అన్నదే మిగతా కథ.
 
నటీనటులు
బాండ్‌ తరహా కథ కావటంతో సినిమా అంతా అడివి శేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇండియన్‌ బాండ్‌లా అడవి శేష్‌ అద్బుతంగా నటించాడు. యాక్షన్, రొమాన్స్‌, కామెడీ, ఎమోషన్స్‌ ఇలా అన్ని వేరియేషన్స్‌ను చాలా బాగా పలికించాడు. తనే రాసుకున్న కథా కథనాలు కావటంతో అవకాశం ఉన్న ప్రతీ చోట తనని తాను చాలా బాగా ఎలివేట్ చేసుకున్నాడు. సినిమాలో జగపతి బాబు ఎంట్రీ ఆడియన్స్‌ కు షాక్‌ ఇస్తుంది. మరోసారి ప్రతినాయకుడి త‌ర‌హా పాత్రలో జగపతి బాబు మెప్పించాడు. కరుడుగట్టిన తీవ్రవాదిగా ఆయన నటన, లుక్స్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. అక్కినేని వారసురాలు సుప్రియ రీ ఎంట్రీకి పర్ఫెక్ట్ క్యారెక్టర్‌ను ఎంచుకున్నారు. త్రినేత్ర టీం ఆఫీసర్‌ పాత్రలో ఆమె నటన సూపర్బ్‌. నెగెటివ్‌ షేడ్స్‌ ను కూడా చాలా బాగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయిన శోభితా దూళిపాలకు మంచి పాత్ర దక్కింది. ఆమె.. గ్లామర్‌ షోతో పాటు నటిగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నాడు. తాను సీరియస్‌గా ఉంటూనే కామెడీ పండించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్‌ రాజ్‌, మధుశాలిని, అనీష్ కురివిల్లా తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
 
రొమాంటిక్ సీన్స్ పై దృష్టి పెట్టాల్సింది
తెలుగు తెర మీద బాండ్ తరహా చిత్రాలు చాలా ఏళ్ల కిందటే వచ్చినా.. ఈ జనరేషన్‌కు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. అలాంటి ఓ రేర్‌ కాన్సెప్ట్‌తో కథను తయారు చేసుకున్న అడివి శేష్‌.. మనం కూడా బాండ్ సినిమాలను తెరకెక్కించగలమని మరోసారి ప్రూవ్‌ చేశాడు. ఎన్నో చిక్కుముడులతో తయారు చేసుకున్న బాండ్‌ కథను ఏమాత్రం కన్ఫ్యూజన్‌ లేకుండా వెండితెర మీద ఆవిష్కరించటంలో దర్శకుడు శశి కిరణ్ విజయం సాధించాడు. ముఖ్యంగా సినిమాలో ప్రతీ పాత్ర ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా ప్లాన్ చేసిన స్క్రీన్‌ప్లే సినిమాకు హాలీవుడ్ స్థాయిని తీసుకువచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొమాంటిక్ సీన్స్‌ కాస్త బోరింగ్  గా అనిపించినా.. సెకండ్‌ హాఫ్‌లో ఆ సీన్స్‌కు ఉన్న కనెక్షన్‌ చూసిన తరువాత లవ్‌ సీన్స్‌ కూడా ఓకె అనిపిస్తాయి. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ ఎలా నిర్వహిస్తారు, వారి సెలక్షన్‌ ఎలా జరుగుతుంది, ఎలా ట్రైన్‌ చేస్తారు లాంటి అంశాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫి, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌కు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకురావటంలో కెమెరామెన్‌ శానెల్‌ డియో, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల విజయం సాధించారు. అబ్బూరి రవి రాసిన మాటలు బుల్లెట్లలా పేలాయి. ఎడిటింగ్, ఆర్ట్‌ ఇలా అన్నీ కలిసి సినిమాను విజయం వైపు నడిపించాయి. నిర్మాణ విలువలు సినిమాకు మరో ఎసెట్‌.
 
ప్లస్‌ పాయింట్స్‌
కథా కథనం
లీడ్‌ యాక్టర్స్ నటన
సినిమాటోగ్రఫి
నేపథ్య సంగీతం
 
మైనస్‌ పాయింట్స్‌
లవ్ సీన్స్‌
టైటిల్ : గూఢచారి
జానర్ : స్పై థ్రిల్లర్‌
తారాగణం : అడివి శేష్‌, శోభితా దూళిపాల, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిశోర్‌
సంగీతం : శ్రీచరణ్‌ పాకల
దర్శకత్వం : శశి కిరణ్ తిక్క
నిర్మాత : అభిషేక్‌ నామా, విశ్వప్రసాద్‌.
 
Rating- 3/5

Continue Reading

చిత్ర సమీక్ష

క‌థ నెమ్మ‌దైనా ఆక‌ట్టుకున్న చి.ల‌.సౌ

Published

on

By

  • Nasreen Khan

అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్‌ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు సుశాంత్‌ హీరోగా ‘చి.ల.సౌ.’ సినిమాను తెరకెక్కించాడు రాహుల్‌. సెన్సిబుల్  ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా నచ్చటంతో అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను రిలీజ్ చేశారు. నాగ్‌ను అంతగా మెప్పించిన అంశాలు చి.ల.సౌ.లో ఏమున్నాయి..? ఈ సినిమాతో సుశాంత్‌ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడా..? దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రాహుల్ రవీంద్రన్‌ సక్సెస్‌ అయ్యాడా..?

కథేమిటంటే…
ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని పట్టుపట్టి కూర్చున్న అర్జున్‌ (సుశాంత్)ని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటారు అమ్మానాన్నలు (అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌). ఇంట్లో పోరు సరిపోలేదన్నట్టుగా తన బెస్ట్‌ ఫ్రెండ్‌ సుజిత్‌ (వెన్నెల కిశోర్‌) కూడా అర్జున్‌ను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతుంటాడు. వీళ్ల పోరు పడలేక ఓ అమ్మాయితో పెళ్లిచూపులకు ఒప్పుకుంటాడు అర్జున్‌. రొటీన్‌ పెళ్లి చూపుల్లా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసిన పేరెంట్స్‌..  అర్జున్‌ను ఒక్కడినే ఇంట్లో ఉంచి అమ్మాయి వస్తుంది మాట్లాడమని చెప్తారు. అంజలి (రుహాని శర్మ) ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో కుటుంబానికి తానే పెద్ద దిక్కు అవుతుంది. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా..? లేక తన మాట ప్రకారం ఐదేళ్ల వరకు పెళ్లి వాయిదా వేశాడా..? అసలు వాళ్ల పెళ్లి చూపులు ఎలా జరిగాయి… అన్నదే మిగతా కథ.

నటీనటులు
చెప్పుకోవటానికి చాలా మంది నటులు ఉన్న హీరో హీరోయిన్లు తప్ప మిగత అన్ని పాత్రలు దాదాపు అతిథి పాత్రలే. సినిమా అంతా అర్జున్‌, అంజలిల చుట్టూనే తిరుగుతుంది. అర్జున్‌ పాత్రలో సుశాంత్ సహజంగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ప్రేమకథ కావటంతో డ్యాన్స్‌లు, ఫైట్లు చేసే ఛాన్స్‌ రాలేదు. నటన పరంగా మాత్రం ఫుల్‌ మార్క్‌ సాధించాడు సుశాంత్‌. హీరోయిన్‌ గా పరిచయం అయిన రుహాని శర్మ తొలి సినిమాతోనే సూపర్బ్‌ అనిపించింది. అర్జున్‌ మీద ఇష్టమున్నా కుటుంబ బాధ్యతల కారణంగా అవుననలేక, కాదనలేక మథ‌న పడే పాత్రలో మంచి నటన కనబరిచింది. అందం, అభినయం రెండింటితోనూ మెప్పించింది. వెన్నెల కిశోర్‌ తన మార్క్‌ కామెడీ డైలాగ్స్‌, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వించాడు. హీరోయిన్‌ తల్లిగా రోహిణి, హీరో తల్లి దండ్రులుగా అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌, ఇతర పాత్రల్లో విద్యుల్లేఖ రామన్‌, జయప్రకాష్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

ఫైన‌ల్లీ…
దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాహుల్ రవీంద్రన్‌. రొటీన్‌ ప్రేమకథలకు భిన్నంగా పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథతో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగానే కాదు రచయితగానూ మంచి మార్కులు సాధించాడు. టేకింగ్‌లోనూ కొత్త దనం చూపించాడు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక్క పూటలో జరిగే సంఘటనలు నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిశోర్‌, సుశాంత్‌ల కాంబినేషన్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ బోరింగ్‌గా అనిపిస్తాయి. పెళ్లిచూపులు సీన్‌ మొదలైన తరువాత కథనం ఇంట్రస్టింగ్‌ మారుతుంది. సినిమాకు సినిమాటోగ్రఫి మరో ప్రధాన బలం. షూటింగ్ పెద్దగా లోకేషన్లు లేకపోయినా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
కథా కథనం
లీడ్‌ యాక్టర్స్‌ నటన
కామెడీ

మైనస్‌ పాయింట్స్‌ :
ఎడిటింగ్‌
ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని బోరింగ్‌ సీన్స్‌

టైటిల్ : చి.ల.సౌ.
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిశోర్‌, రోహిణి, అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌
సంగీతం : ప్రశాంత్‌ విహారి
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్‌
నిర్మాత : అక్కినేని నాగార్జున, జస్వంత్‌ నాడిపల్లి, భరత్‌ కుమార్‌

Rating: 2.5/5

 

Continue Reading

Trending