Connect with us

పత్రికా సమావేశం

చిల‌సౌ… చాలా బాగా న‌చ్చింది – కింగ్ నాగార్జున‌

Published

on

చి.ల‌.సౌ. సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్. తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ సినిమా ద‌ర్శ‌క‌త్వంపై మంచి ప‌ట్టు క‌న‌బ‌రిచాడ‌ని సీనియ‌ర్ న‌టుడు నాగార్జున కితాబిచ్చారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ క్ర‌కియేష‌న్స్ బ్యాన‌ర్స్ పై తెర‌కెక్కిన ఈ చిత్రానికి నాగార్జున‌తో పాటుగా భ‌ర‌త్ కుమార్, జ‌స్వంత్ నిర్మాత‌లు. ఆగ‌స్టు 3న చి.ల‌.సౌ. విడుద‌ల కానున్న సంద‌ర్భంగా  నాగార్జున బుధ‌వారం మీడియాతో ముచ్చటించారు.

ఆస‌క్తి లేద‌ని చెప్పాను
ముందుగా నాగ చైత‌న్య  ‘చిలసౌ’ సినిమా బావుందని చెప్పాడు. అయితే నేను ఇంట్రస్టు లేదని చెప్పాను. తప్పకుండా చూడాలి మంచి సినిమా అని చెప్పడంతో…. వెళ్లి చూశాను. చాలా ప్రెష్‌గా అనిపించింది. ఇలాంటి సినిమాలు నేను ఎందుకు చేయడం లేదనే భావన కలిగింది. రాహుల్ బాగా హ్యాండిల్ చేశాడు.

ఫస్ట్‌టైమ్ డైరెక్షన్ అయినా రాహుల్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా నాకు బాగా నచ్చింది కాబట్టే అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. నీకు ఇంట్ర‌స్ట్ ఉందా? అని అడిగిత అతడు వెంటనే ఓకే చెప్పాడు. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా స‌మ‌యంలో స్క్రిప్ట్ స్టేజ్ నుండి అన్న‌పూర్ణ స్టూడియోస్ ఇన్‌వాల్వ్ అయింది. కానీ ఈ సినిమాలో అలాంటి ఇన్వాల్మెంట్ ఏమీ లేదు అని నాగార్జున తెలిపారు.

మంచిపాత్రలు వస్తేనే హిందీలో చేస్తా
న‌న్ను తెలుగు ప్రేక్ష‌కులు కింగ్ లా ట్రీట్ చేస్తున్నారు. నేనెందుకు తెలుగు వ‌దిలిపెట్టి బాలీవుడ్ కి వెళ్ళాలి. ఇది నా ఇల్లు అని ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు నాగార్జున‌. శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్‌కి వెళ్తున్న‌ప్పుడు నన్నుకూడా రమ్మన్నాడు. నేను అప్పుడే చెప్పాను నేను నా తెలుగు ప్రేక్షకులను వదిలి రాను అని చెప్పాన‌న్నారు.  15 ఏళ్ల తర్వాత హిందీలో మళ్లీ చేస్తున్నాను. ఇంతకు ముందు తమిళంలో ఊపిరి చేశాను. నేను సినిమాలో ఎంత సేపు ఉన్నాననేది ముఖ్యం కాదు కానీ, నా పాత్ర ప్రాధాన్య‌త ఏమిట‌నేదే ముఖ్యం… అని నాగార్జున చెప్పారు.

ఆర్ఎక్స్ 100పై ఆ కామెంట్స్ ఎందుకొచ్చాయో తెలియదు
కొన్ని ‘ఆర్ఎక్స్ 100′ లాంటి సినిమాలు ఉంటాయి. దాని మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి. లాస్ట్ 2 రీల్స్ చూశాను.  హానెస్ట్ రైటింగ్… ఫ్యామిలీ ఫిల్మ్స్ ఉంటాయి, కొంచెం అడల్ట్ మెటీరియల్ ఫిల్మ్స్… ఇలా  అన్ని రకాల ఫిల్మ్స్ ఉంటాయి. అదే మైండ్ సెట్‌తో ఆలోచిస్తే వారు ఆ సినిమాను చాలా హానెస్టుగా తీశారు. అన్నపూర్ణలో ఆర్ఎక్స్ 100 డిఐ జరుగుతుంటే లాస్ట్ 2 రీల్స్ ఉన్నాయి చూడమంటే చూశాను. రైటింగ్, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నీ బావున్నాయి. అలాంటి సినిమా కాబట్టే హిట్ అయింది. త్వరలోనే ఫుల్ మూవీ చూడాలి అని నాగార్జున అన్నారు.

అఖిల్‌ను చూసి 45 రోజులైంది
ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ … అఖిల్ ఎలా ఉన్నాడో తెలియదు. చూసి 45 రోజులు అవుతోంది. షూటింగులో భాగంగా లండన్లో ఉన్నాడు. అప్పుడప్పుడు వాళ్ల అమ్మతో మాట్లాడతాడు కానీ నాతో రోజూ మాట్లాడడు. వాడు చేస్తున్న సినిమాకు సంబంధించిన‌ విషయాలు నాకు పెద్దగా తెలియదు. ఫస్ట్ లుక్ ఏమైనా వస్తోందా? అంటూ నాగార్జున ఎదురు ప్రశ్న వేశారు.

బ్ర‌హ్మాస్త్రలోని పాత్ర బాగా న‌చ్చింది
బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ గురించి 15 ఏళ్ల తర్వాత ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో మళ్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంపై స్పందిస్తూ… నేను బాలీవుడ్‌కి వెళ్ల‌లేదు. వాళ్లే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. నేను బాలీవుడ్ సినిమా చేసి 15 ఏళ్లు అవుతుంది. అయాన్ ముఖర్జీ, క‌ర‌ణ్ జోహార్ వ‌చ్చి మీరు ఈ పాత్ర చేస్తే మా సినిమాకు గౌరవంగా ఉంటుందని అడిగారు. నాకు స్క్రిప్ట్ కాకుండా త్రీడీ వెర్ష‌న్‌లో నా పాత్ర గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే నేను చేస్తానని చెబితే వాళ్లు మూడు నెల‌ల తర్వాత మళ్లీ వచ్చారు. చాలా బాగా నచ్చింది. సినిమాలో నేను 15 నిమిషాలు క‌న‌బ‌డ‌తాను. ఇప్ప‌టికే బ‌ల్గేరియాలో ఓ వారం షూటింగ్ కూడా అయిపోయిందని నాగార్జున తెలిపారు.

అది కావాలని చేసిన తప్పు కాదు
కళ్యాణ్ జ్యువెల్లర్స్ యాడ్ వివాదంపై స్పందిస్తూ… అది వారు కావాలని చేసిన తప్పు కాదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. వెంటనే దాన్ని తీసేస్తున్నట్లు కూడా చెప్పారు. అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి అని నాగ్ తెలిపారు.

తాజా వార్తలు

`ఐశ్వ‌ర్యాభిమ‌స్తు` మ్యూజిక్ లాంచ్‌

Published

on

By

శ్రీమ‌తి వ‌రం మాధ‌వి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆర్య‌, విశాల్, సంతానం, త‌మ‌న్నా, భాను న‌టించిన చిత్రం `ఐశ్వ‌ర్యాభిమ‌స్తు`. ఎం.రాజేష్ ద‌ర్శ‌కుడు. వ‌రం జ‌య‌త్ కుమార్ నిర్మాత‌. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల సీడీని కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా బుధ‌వారం హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు.
ర‌మేశ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “మా నాన్న పెద్ద భూస్వామి అయినా.. నాన్న సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్ప‌కుండా సినిమాల్లో రాణించాల‌ని ముంబై వెళ్లిపోయారు. నెమ్మ‌దిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. ద‌ర్శ‌కుడిగా ఎదిగారు. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల‌పై మంచి ప‌ట్టు సాధించారు. ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్స్ సిల్వ‌ర్ జుబ్లీలు చాలా తీసింది. స‌కుటుంబంగా చూడ‌ద‌గ్గ కుటుంబ విలువ‌లున్న సినిమాల‌ను చాలా చేశాం. ఏక్ తుఝే కేలియే కూడా చేశాం. ఇవ‌న్నీ చాలా వండ‌ర్స్ సృష్టించాయి. మా నాన్న సినిమాల‌పై త‌ప్ప‌, ఇంక‌దేనిపై ఇన్వెస్ట్ చేయ‌డానికి ముందుకొచ్చేవారు కాదు. అందుకే మాకు చెన్నై, ముంబై, బెంగుళూరు, హైద‌రాబాద్‌లో కార్యాల‌యాలున్నాయి. అంద‌రిళ్ల‌ల్లో  మా ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్స్ గురించి తెలుసు. నంద‌గోపాల్ అని మా ద‌గ్గ‌ర ఆడిట‌ర్ ఉన్నారు. ప్ర‌జ‌లు సినిమా చూడ‌టం వ‌ల్ల‌నే నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నాను అని అనుకుని రూ.కోటి పెట్టి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసి, ఐదెక‌రాల స్థ‌లాన్ని కేటాయించాం. నాగేశ్వ‌ర‌రావుగారు ఓ డాక్ట‌ర్‌. ఆయ‌న కూడా మా నాన్న‌లాగానే సేవాత‌త్ప‌ర‌త ఉన్న వ్య‌క్తి. మ‌న ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికే ఆయ‌న మ‌న దేశానికి వ‌చ్చాడు. మా ఐ ఇన్‌స్టిట్యూట్ ని అంత‌ర్జాతీయ గుర్తింపు ఉంది. భ‌విష్య‌త్తు త‌రాల వారికీ ఉప‌యోగ‌ప‌డే ప్రాజెక్ట్ అది. 50 శాతం మందికి మేం అక్క‌డ ఉచితంగా సేవ‌లు అందిస్తున్నాం“ అని అన్నారు.
నిర్మాత వ‌రం జ‌య‌త్ కుమార్ మాట్లాడుతూ – “ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేస్తున్నాం. త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాం. స‌పోర్ట్ అందిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌“ అన్నారు.
కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా మాట్లాడుతూ – “నిర్మాత జ‌యంత్‌కు ఈ సినిమా పెద్ద విజ‌యాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్య‌తో నాకు మంచి అనుబంధం ఉంది. త‌న‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. త‌మిళంలో సూప‌ర్‌హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ – “మంచి హిలేరియ‌స్ ఎంటర్‌టైన‌ర్‌. జ‌యంత్ తెలుగులో చేస్తున్న ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెస్ కావాలి. పాజిటివ్ ప‌ర్స‌న్ జ‌యంత్ పెద్ద స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
By:    Nasreen Khan

Continue Reading

తాజా వార్తలు

సోషియో ఫాంటసీ హారర్

Published

on

By

ఎంటర్ టైనర్ ‘గండ భేరుండ’ పాటల విడుదల!!

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ ‘గండభేరుండ’. చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా.. రాధిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పాటలు ట్రెండ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అక్టోబర్ 5 న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. హీరోయిన్ రాధిక, దర్శకుడు సూరియన్, నిర్మాత చల్లమళ్ల రామకృష్ణ, హీరోల్లో ఒకరైన పవన్ కుమార్, విలన్ పాత్రధారి రవికిరణ్ శొంఠి, లేడీ డైరెక్టర్ సుచరిత, ఆనంతలక్ష్మి, డి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాటలతోపాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన అనంతరం ‘గందభేరుండ’ ఘన విజయం సాధించాలని లయన్ సాయి వెంకట్, జె.వి.మోహన్ గౌడ్ ఆకాంక్షించారు. హీరోయిన్ గా పరిచయమవుతున్న రాధికకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు.
 
 దర్శకుడు సూర్యన్ మాట్లాడుతూ.. ‘గండ భేరుండ పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్ని అత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే ఇతివృత్తంతో రూపొందిన సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ ‘గండభేరుండ’. మలేషియాలో చేయించిన 17 నిమిషాల నిడివి కల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మా నిర్మాతలు కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ ‘గండభేరుండ’ చిత్రాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం. సినిమా అద్భుతంగా వచ్చింది” అన్నారు. 
 
నిర్మాత చల్లమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. “సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. 
రవికిరణ్, సమ్మెట గాంధీ, విశ్వేశ్వరావు, జయవాణి, రాధ, శ్రీరంభ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి  కెమెరా: ఆనంద్, సంగీతం: శ్రీసాయిదేవ్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాతలు: కె.సూరిబాబు-చల్లమళ్ళ రామకృష్ణ, రచన-దర్శకత్వం: కె.సూరిబాబు!!
By:    Nasreen Khan

Continue Reading

తాజా వార్తలు

‘ నాటకం ‘ మూవీ సక్సెస్ మీట్..!!

Published

on

By

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా  విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం  ‘నాటకం’.. కళ్యాణ్ జి గోగన దర్శకుడు.  సాయి కార్తీక్ సంగీతం అందించగా గరుడవేగతో మంచి పేరు తెచ్చుకున్న అంజి సినిమాటోగ్రఫీ ని అందించారు..   కాగా ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా రిలీజ్ అయ్యింది.  ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ను ఈ రోజు ఎంతో అంగరంగవైభవంగా జరిపారు.. ఈ కార్యక్రమానికి సినిమా టీం అందరు రాగ, సినిమా  హిట్ పై తమ ఆనందాన్ని వెల్లడించారు..
ఈ సందర్భంగా నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ..  నమ్మి సినిమా ని కొన్నందుకు అది మీరు ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాల థాంక్స్.. మా బ్యానర్ లో ఫస్ట్ ఫిలిం ఇంత పెద్ద హిట్ అవడం చాల హ్యాపీ గా ఉంది.. ఈ ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తానని చెప్తున్నాను.. అందరు కష్టపడి చేసిన సినిమా ఇది.. చిన్న సినిమా, అదీ అందరు కొత్త ఆర్టిస్టులతో వచ్చిన సినిమా ఇలాంటి సినిమా హిట్ చేసినందుకు చాల చాల థాంక్స్ అన్నారు..
హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ..   అందరు ఫోన్ చేసి సినిమా చాల బాగుందని అంటున్నారు.  ఇక్కడే కాదు యూకే నుంచి కూడా మంచి టాక్ వస్తుంది. సినిమా నిన్న రిలీజ్ కాగానే మంచి రెస్పాన్స్ వచ్చింది.. చాల హ్యాపీ గా ఉంది. వేరే ప్లేసెస్ లో సినిమా రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికి ధన్యవాదాలు అన్నారు..
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ..
చిన్న సినిమాలను మళ్ళీ మళ్ళీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ కూడా చాల బాగా వచ్చాయి.. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి చాల థాంక్స్..ఈ సినిమా కి మెయిన్ మౌత్ టాకే పబ్లిసిటీ.. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఈ సినిమా కి పనిచేసిన అందరికోసం ఈ సినిమా  సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
By:    Nasreen Khan

Continue Reading

Trending